NTV Telugu Site icon

Ram Mandir PranPrathistha: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ.. స్సెషల్‌ విషెస్‌ చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్!

Keshav Maharaj

Keshav Maharaj

Keshav Maharaj React on Ram Mandir PranPrathistha: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మరికొద్ది సేపట్లో జరగనుంది. అయోధ్య గర్భగుడిలో రామ్‌లల్లా కొలువుదీరబోతున్నాడు. మధ్యాహ్నం 12: 20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. దాంతో 500 ఏళ్ల నాటి హిందువుల కల నెరవేరనుంది. ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ కేశవ్ మహరాజ్ స్పందించాడు. భారత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలను తెలిపాడు.

ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేశవ్ మహరాజ్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశాడు. ‘అందరికీ నమస్కారం. ప్రపంచ వ్యాప్తంగా, దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలకు శుభాకాంక్షలు. రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరగాలని కోరుకుంటున్నా. అందరిలోనూ శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక జ్ఞానోదయం తీసుకురావాలి. జై శ్రీరామ్‌’ అని కేశవ్‌ మహరాజ్‌ వీడియోలో చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మెడియల్ వైరల్ అయింది. భారత్ ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లగా.. టెస్టుల్లో కేశవ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మైదానంలో శ్రీరాముని పాటలు వినిపించాయి.

Also Read: VYooham Movie: ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్!

రామమందిర ప్రాణప్రతిష్ఠకు రావాలని భారత క్రికెటర్లకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలను పంపించింది. ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, వెంకటేశ్ ప్రసాద్.. విరాట్ కోహ్లీ దంపతులు అయోధ్యకు చేరుకున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్‌, మహిళా జట్టు హర్మన్‌ ప్రీత్‌ కౌర్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా ఆహ్వానాలు అందాయి. టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో రోహిత్ హైదరాబాద్ వచ్చాడని తెలుస్తోంది.