NTV Telugu Site icon

Rajat Patidar: పుజారా, సర్ఫరాజ్‌ కాదు.. కోహ్లీ స్థానంలో పాటిదార్‌!

Rajat Patidar

Rajat Patidar

Rajat Patidar Replace Virat Kohli In Team India For First Two Tests Against England: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు భారత జట్టులోకి వస్తారనే ఊహాగానాలకు తెరపడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు విరాట్ స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. దాంతో టెస్ట్ జట్టులో చోటు ఆశించిన ఛెతేశ్వర్‌ పుజారా, సర్ఫరాజ్‌ ఖాన్‌, రింకూ సింగ్‌లకు నిరాశే ఎదురైంది. వ్యక్తిగత కారణాల వల్ల హైదరాబాద్, విశాఖపట్నంలో జరిగే రెండు మ్యాచ్‌లకు కోహ్లీ దూరం అయిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ లయన్స్‌పై వరుస సెంచరీలు (111, 151) బాదడంతో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు రజత్ పాటిదార్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందట. 30 ఏళ్ల పాటిదార్ 202 డిసెంబర్ 21న దక్షిణాఫ్రికాపై పార్ల్‌లో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 22 పరుగులు చేశాడు. పాటిదార్‌ రైట్‌ హ్యాండ్‌ బ్యాటింగ్‌, రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా ఎ తరపున అతడు ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే భారత ప్లేయింగ్ 11లోకి ఎంపికైతే.. మిడిల్ ఆర్డర్‌లో (కోహ్లీ ఆడే నాలుగో స్థానం) ఆడే అవకాశం ఉంది. ఒకవేళ శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం కల్పించాలని భావిస్తే యంత్రం పాటిదార్‌ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు.

2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్‌.. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడి 404 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 2 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా జనవరి 25 నుంచి ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్ట్‌ల కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. అందులో పాటిదార్‌కు చోటు దక్కలేదు. విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో సెలెక్టర్లు పాటిదార్‌ను అతని ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు.

Also Read: IND v ENG: భారత్‌కు అచ్చొచ్చిన ఉప్పల్‌ మైదానం.. అశ్విన్‌కు తిరుగేలేదు!

తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్‌ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), ధృవ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌, రజత్‌ పాటిదార్‌.

Show comments