Virat Kohli: నేను చెప్పిందంతా అబద్ధం.. విరాట్ విషయంలో డివిలియర్స్ యూటర్న్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AB de Villiers Takes U-turn his comments regarding Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు. విరాట్-అనుష్క శర్మ దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్ధం అని, కోహ్లీ వ్యక్తిగత విషయాలను యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడి తాను పెద్ద తప్పు చేశాను అని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాల కారణంగా ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ దూరం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో పలు వదంతులు వ్యాపించాయి.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భవతి అని, అందుకే రికార్డుల రారాజు ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు విరామం తీసుకున్నాడని సోషల్ మీడియాలో ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత.. తల్లి అనారోగ్యం కారణంగానే విరాట్ ఆటకు దూరమయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే తమ తల్లి సరోజ్ కోహ్లీ ఆరోగ్యంగానే ఉన్నారని విరాట్ సోదరుడు వికాస్ స్పష్టం చేశాడు. అదే సమయంలో తన యూట్యూబ్ చానెల్‌లో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతున్న సందర్భంలో విరాట్ గురించి ప్రస్తావన వచ్చింది. ‘విరాట్ బాగానే ఉన్నాడు. విరాట్-అనుష్క దంపతుల రెండో బిడ్డ త్వరలోనే ఈ ప్రపంచంలోకి రానుంది’ అని డివిలియర్స్ చెప్పాడు. దీంతో విరుష్క దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని ఏబీడీ స్పష్టం చేశాడు.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
Also Read: KS Bharat: రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు.. భరత్ రాణిస్తేనే భవిష్యత్తులో అవకాశాలు!
అయితే తాజాగా ఏబీ డివిలియర్స్ తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకోవడం గమనార్హం. విరాట్-అనుష్క దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్ధం అని పేర్కొన్నాడు. దైనిక్ భాస్కర్‌తో డివిలియర్స్ మాట్లాడుతూ… ‘నా యూట్యూబ్ ఛానెల్‌లో నేను చెప్పినట్లుగా క్రికెట్ కంటే కుటుంబమే ప్రథమ ప్రాధాన్యం. నా యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ నేను ఓ పెద్ద తప్పు చేశా. ఆరోజు నేను చెప్పిందంతా అబద్ధం. అందులో ఏమాత్రం నిజం లేదు. విరాట్ కుటుంబానికి ఏది మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. విరాట్ విరామానికి కారణం ఏమైనప్పటికీ.. అతడు మరింత రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..