Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Eng 4th Test Ranchi Pitch Report Today 152 Runs Target Not Easy To Chase

IND vs ENG 4th Test: విజయానికి 152 పరుగులే.. భారత్‌కు అంత ఈజీ కాదు!

Published Date :February 26, 2024 , 10:06 am
By Sampath Kumar
IND vs ENG 4th Test: విజయానికి 152 పరుగులే.. భారత్‌కు అంత ఈజీ కాదు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Ranchi Test Pitch Report Today: రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 152 పరుగులు మాత్రమే అవసరం. అయితే అది భారత్‌కు అంత ఈజీ కాకపోవచ్చు.

రాంచీ పిచ్ నాలుగో రోజు మరింతగా స్పిన్‌కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్లకు తగినట్లుగా ఈ పిచ్ మారుతుంది. కాబట్టి ఇంగ్లండ్‌ స్పిన్నర్లు టామ్ హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, జో రూట్ చెలరేగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తేనే విజయం సాధ్యమవుతుంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో బషీర్‌ 5, హార్ట్‌లీ 3 వికెట్స్ పడగొట్టారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆర్ అశ్విన్ 5, కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ పడగొట్టిన విషయం తెలిసిందే.

Also Read: R Ashwin: అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసిన ఆర్ అశ్విన్‌!

మూడో రోజు భారత్‌ను 307 పరుగులకు ఆలౌట్ చేసిన ఇంగ్లండ్.. 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. భారత స్పిన్నర్ల ధాటికి 145 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్, కుల్దీప్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. బెన్ డకెట్ (15), ఓలీ పోప్ (0), జో రూట్ (11), బెన్ స్టోక్స్ (4) మళ్లీ నిరాశపరిచారు. జాక్ క్రాలే (60), జానీ బెయిర్‌స్టో (30)లు టాప్ స్కోరర్లు. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ మూడో రోజు ఆట ముగిసేసరికి 40/0తో ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ind vs eng
  • Ind vs Eng 4th Test
  • Ranchi
  • Ranchi Pitch
  • Ranchi Pitch Report

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions