IND vs ENG: ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 నేడు.. బ్యాటింగ్ విభాగం పుంజుకోకుంటే..!
- నేడు భారత్, ఇంగ్లండ్ నాలుగో టీ20
- తుది జట్టులోకి రింకు సింగ్
- స్టార్ స్పోర్ట్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. మూడో టీ20లో ఓడిన సూర్యసేన.. తిరిగి గెలుపు బాట పట్టి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. తొలి విజయం రుచి చూసిన ఇంగ్లండ్ నాలుగో టీ20లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. పుణెలో శుక్రవారం కీలక నాలుగో టీ20 భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనుంది. రాత్రి 7 నుంచి మ్యాచ్ ఆరంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
2024లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడిన సంజు శాంసన్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నిరాశపరుస్తున్నాడు. మూడు టీ20ల్లో వరుసగా 26, 5, 3 పరుగులే చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సిరీస్‌లో 0, 12, 14 పరుగులే చేశాడు. సంజు, సూర్య పుంజుకోవాల్సిన అవసరం ఉంది. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా ఫామ్‌లో ఉండడం భారత జట్టుకు సానుకూలాంశం. వెన్ను నొప్పి కారణంగా గత రెండు టీ20లకు దూరమైన రింకు సింగ్ ఫిట్నెస్ సాధించాడు. రింకు తుది జట్టులోకి వస్తే ధృవ్ జురెల్ తప్పుకోక తప్పదు. శివమ్ దూబె ఆడే అవకాశాలు లేకపోలేదు.
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
భారత బౌలర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఏడాదికి పైగా విరామం తర్వాత జట్టులోకి వచ్చిన మహ్మద్ షమీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడం కలిసొచ్చే అంశం. ఈ మ్యాచులో ఒక స్పిన్నర్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ ఆడుతాడేమో చూడాలి. ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ నిలకడగా రాణిస్తున్నాడు. డకెట్, లివింగ్స్టన్ ఫామ్ అందుకోగా.. సాల్ట్, బ్రూక్ హిట్టింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రషీద్, కార్స్, ఆర్చర్, ఒవర్టన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. నాలుగో టీ20లో స్పెషలిస్టు స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను ఆడించే అవకాశాలున్నాయి.
తుది జట్లు (అంచనా):
భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లివింగ్స్టన్, జేమీ స్మిత్, బ్రైడన్ కార్స్, జేమీ ఒవర్టన్, అడిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.
తాజావార్తలు
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!