Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACC Plans to felicitated KS Bharat in IND vs ENG 2nd Test: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు విశాఖ మైదానంలో ప్రాక్టీస్‌లో బిజీ అయ్యారు. రెండో టెస్టు కోసం రెండు రోజుల కిందటే విశాఖపట్నంకు చేరుకున్న టీమిండియా క్రికెటర్లు బుధవారం స్టేడియంలో చెమటోడ్చారు. టీమిండియా కీపర్, ఆంధ్ర కెప్టెన్ కేఎస్ భరత్ తన హోం గ్రౌండ్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న కేఎస్ భరత్‌ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్ణయించుకుంది. ‘విశాఖ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన శ్రీకర్ భరత్‌ను రెండో టెస్ట్ సందర్భంగా ఘనంగా సన్మానిస్తాం. ఈ కార్యక్రమంను గురువారం స్టేడియంలో ఏర్పాటు చేశాం. ఇది భరత్ విజయానికి దగ్గిన గౌరవం’అని ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి తెలిపారు. భరత్ క్రికెట్ ప్రయాణం వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే ప్రారంభమైంది. 2005లోబాల్ బాయ్‌గా ఉన్న అతడు.. అదే మైదానంలో ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
Also Read: Jack Leach Injury: వైజాగ్ టెస్టుకు ముందు భారత్‌కు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఔట్!
సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా కేఎస్ భరత్ నిలవనున్నాడు. భరత్ కంటే ముందు ఆంధ్ర ప్లేయర్ సీకే నాయుడు సొంతగడ్డపై ఆడాడు. ఎమ్మెస్కె ప్రసాద్, వేణు గోపాల్ రావు, హనుమ విహారి భారత్ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్ రాలేదు. ఇక వీవీఎస్ లక్షణ్ హైదరాబాద్ ప్లేయర్ అన్న విషయం తెలిసిందే. భరత్ ఇప్పటివరకు 6 టెస్టులు ఆడి 198 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!