Fan who touch Rohit Sharma’s feet sent jail in Uppal Test:హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. బారికేడ్స్ దాటి పరిగెత్తుకుంటూ వెళ్లి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్లు మొక్కాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ.. ఆ అభిమానిని బయటకు తీసుకెళ్లారు. తొలిరోజు (జనవరి 25) భారత్ ఇన్నింగ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అభిమాని బారికేడ్స్ దాటి మైదానంలోకి దూసుకురావడాన్ని రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అభిమానికి 14 రోజుల రిమాండ్ విధించాడు. ఈ ఘటన నేపథ్యంలో ఉప్పల్ మైదానంలో సెక్యూరిటీ పెంచారు. ప్రేక్షకులు వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని, నిబంధలు విరుద్ధంగా మైదానంలోకి వెళితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
Also Read: Australian Open 2024: సబలెంకదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్.. రెండో ప్లేయర్‌గా రికార్డు!
శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 316/6తో నిలిచింది. ఓలి పోప్ (148 బ్యాటింగ్; 208 బంతుల్లో 17×4) సెంచరీతో సత్తాచాటాడు. పోప్‌తో పాటు రెహాన్ అహ్మద్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా (2/29), ఆర్ అశ్విన్ (2/93) వికెట్స్ పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు భారత్ 190 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్ స్కోరు 421/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రోహిత్ సేన 436 పరుగులకు ఆలౌటైంది. ఆర్ జడేజా (87; 180 బంతుల్లో 7×4, 2×6) టాప్ స్కోరర్.
A fan met Rohit Sharma and touched his feet in Hyderabad.pic.twitter.com/25C07t2WaX
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 25, 2024