NTV Telugu Site icon

IND vs BAN: మూడో రోజు ముగిసిన ఆట.. విజయం ముంగిట భారత్

Ind Vs Ban

Ind Vs Ban

బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసింది. బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 37.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో 9 ఓవర్లు ఉండగానే ఆటను నిలిపేశారు. క్రీజులో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (51*) అర్ధ సెంచరీతో పోరాడుతున్నాడు. మరో ఎండ్‌లో షకీబ్ అల్ హసన్ (5*) ఉన్నారు. బంగ్లాదేశ్ గెలవాలంటే 357 పరుగులు చేయాలి. కానీ వారి చేతిలో ఇంకా 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 6 వికెట్లు భారత్ బౌలర్లు పడగొడితే భారత్‌కు గెలుపు వరిస్తుంది.

Read Also: Software Engineer: పని ఒత్తిడితో డిప్రెషన్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..

మూడో రోజు భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 287/4 వద్ద డిక్లేర్ చేసింది. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్‌కు 515 పరుగుల టార్గెట్ నిలిచింది. కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 515 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. కీలక 4 వికెట్లు పోగొట్టుకుంది. జాకీర్ హాసన్ (33), షాద్ మన్ ఇస్లాం (35), మోహినుల్ హక్ (13), ముష్ఫిఖర్ రహీం (13) పరుగులు చేసి ఔటయ్యారు. భారత్ బౌలర్లలో 3 వికెట్లతో చెలరేగాడు. మరో వికెట్ బుమ్రాకు దక్కింది.

Read Also: Cheating: ప్రియుడు మోసం.. ప్రియురాలి న్యూడ్ వీడియోలు స్నేహితులకు షేర్