NTV Telugu Site icon

Rohit Sharma: అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!

Rohit Sharma Lady Fan

Rohit Sharma Lady Fan

టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ముంబైలోని ఓ సిగ్నల్ వ‌ద్ద అభిమానికి సెల్ఫీ ఇచ్చాడు. అంతేకాదు షేక్ హ్యాండ్ ఇచ్చి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ‘హిట్‌మ్యాన్ గ్రేట్’, ‘రోహిత్ సూపర్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Hardik Pandya: బంగ్లా చిన్న జట్టు.. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు: ఆర్పీ సింగ్

ఇటీవల బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌లో ఆడిన రోహిత్ శర్మ.. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. ఆక్టోబ‌ర్ 16 నుంచి బెంగ‌ళూరులో జ‌ర‌గ‌నున్న తొలి టెస్టు కోసం రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేసేందుకు రోహిత్ తన లంబోర్ఘిని కారులో ముంబైలోని జియో పార్క్ స్టేడియంకు వెళ్తుండ‌గా ఓ సిగ్నల్ వ‌ద్ద ఆగాడు. ఆ సమయంలో హిట్‌మ్యాన్‌ను చూసిన ఓ లేడి ఫ్యాన్.. కారు వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకుంటూ వెళ్ళింది. సెల్ఫీ అడగ్గానే రోహిత్ ఫోటోకు ఫోజు ఇచ్చాడు. ఈ రోజు త‌న బ‌ర్త్‌డే అని ఆమె చెప్ప‌గా.. షేక్ హ్యాండ్ ఇచ్చి విషెష్ తెలియజేశాడు. దాంతో ఆ అమ్మాయి సంతోషపడిపోయింది.

Show comments