IND vs BAN: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌట్.. భారత్ ముందు స్వల్ప లక్ష్యం!
- 146 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
- భారత్ ముందు 95 పరుగుల లక్ష్యం
- భారత్ సునాయాస విజయం సాధించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దెబ్బకు 47 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. షద్మాన్ ఇస్లామ్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. ముష్ఫికర్ రహీమ్ (37) రాణించాడు. టీమిండియా బౌలర్లు ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్స్ పడగొట్టారు. భారత్ ఎదుట 95 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంచ్ బ్రేక్ అనంతరం భారత్ లక్ష్య చేధనకు దిగనుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 233 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ 26/2 స్కోరుతో చివరిరోజైన మంగళవారం ఆటను ప్రారంభించిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మొమినల్ హక్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. లెగ్ సైడ్‌లో రాహుల్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. కెప్టెన్ షాంటో (19)తో కలిసి షద్మాన్ ఇస్లామ్ (50) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. కుదురుకున్న ఈ ఇద్దరు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. షాంటోను జడేజా, ఇస్లామ్‌ను ఆకాష్ వెనక్కి పంపారు.
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
Also Read: The Goat OTT: విజయ్ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
లిటన్ దాస్ (1), షకిబ్ (0)ను జడేజా.. మెహిదీ హసన్ (9), తైజుల్ ఇస్లామ్ (0)ను బుమ్రా అవుట్ చేశాడు. ముష్ఫికర్ రహీమ్ క్రీజ్‌లో పాతుకుపోయి.. భారత బౌలర్లను కాస్త విసిగించాడు. ఖలెద్ (5 నాటౌట్)తో కలిసి ఆరు ఓవర్ల పాటు క్రీజులో నిలబడ్డాడు. చివరి వికెట్ కావడంతో లంచ్ బ్రేక్ సమయాన్ని అంపైర్లు పొడిగించారు. ఎట్టకేలకు ముష్ఫికర్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేయడంతో బంగ్లా ఇన్నింగ్స్‌కు తెర పడింది. ఈ టెస్టులో భారత్ సునాయాస విజయం సాధించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!