NTV Telugu Site icon

Rohit Sharma: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!

Rohit Sharma Toss

Rohit Sharma Toss

Rohit Sharma Selected Field after 9 Years in Tests in India: కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా భారత గడ్డపై జరిగే మ్యాచుల్లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్లు బౌలింగ్‌ను తీసుకోవడం చాలా అరుదు. కానీ రోహిత్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చివరిసారిగా 2015లో అప్పటి సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

స్వదేశంలో టెస్ట్ మ్యాచ్‌లలో భారత కెప్టెన్లు టాస్ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటారు. భారత్‌లోని పరిస్థితులే ఇందుకు కారణం. తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువగా పరుగులు చేసి.. పర్యాటక జట్టుపై ఒత్తిడిని తెస్తారు. అంతేకాదు మూడో రోజు నుంచి బంతి ఎక్కువగా టర్న్ అవుతుందని తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటారు. భారత్‌లో నాలుగో ఇన్నింగ్స్‌ అత్యంత ప్రమాదకరం. ఛేదన చాలా కష్టం. గణాంకాలు కూడా ఇదే చెబుతాయి. అందుకే టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంటారు. కానీ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

Also Read: IPL 2025: రిటైర్మెంట్ ప్రకటించిన గంటల్లోనే మెంటార్‌గా బాధ్యతలు.. గంభీర్‌ పోస్ట్ కొట్టేశాడు!

కాన్పూర్‌లో 24 టెస్టులు జరగగా.. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అప్పటి కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. సాధారణంగా కాన్పూర్ పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. అయితే గురువారం రాత్రి వర్షం పడటం, నేడు వాతావరణం మేఘావృతమై ఉండటంతో రోహిత్ శర్మ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండటతో ఆ పరిస్థితులను ఉపయోగించుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.