NTV Telugu Site icon

Nitish Reddy: నితీశ్ రెడ్డి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ ఇదే.. తండ్రి భావోద్వేగం!

Nitish Reddy Test Debut

Nitish Reddy Test Debut

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. ఈ టెస్టులో టీమిండియా తరఫున ఇద్దరు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో స్థానం దక్కింది. ఇప్పటికే టీ20ల్లో అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు నితీశ్‌… పెర్త్ టెస్ట్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్‌ టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు.

విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్‌ రెడ్డి టెస్టు క్యాప్‌ను అందుకోవడంతో అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య క్రికెటర్ విరాట్ చేతుల మీదుగా టెస్టు క్యాప్‌ను అందుకోవడం నితీశ్ లైఫ్‌లో అత్యుత్తమ క్షణాలని చెప్పారు. ‘టెస్టుల్లో అరంగేట్ర సమయంలో విరాట్ కోహ్లీతో టీమిండియా క్యాప్ అందుకోవాలని నితీశ్ ఎప్పటి నుంచో కలలు కన్నాడు. ఆ కల నేడు నెరవేరింది. నితీశ్ లైఫ్‌లో అత్యుత్తమ క్షణం ఇదే. ఓ తండ్రిగా నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఈ ఏడాది నితీశ్‌కు గొప్పగా కలిసొచ్చింది. ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ అదరగొట్టాడు. దాంతో బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై ఆడుతున్నాడు. కోహ్లీతో కలిసి నితీశ్ ఆడుతుండడం ఆనందంగా ఉంది’ అని ముత్యాల రెడ్డి చెప్పారు.

Also Read: Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’లో 14వ రోజు.. నేటి విశేష కార్యక్రమాలు ఇవే!

పెర్త్‌ టెస్టులో నితీశ్‌ రెడ్డి అదరగొడుతున్నాడు. ఆరు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును నితీశ్‌ ఆదుకున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. 47 బంతుల్లో 27 రన్స్ చేశాడు. మరోవైపు పంత్ 37 రన్స్ చేసాడు. భారత్ 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది.