NTV Telugu Site icon

Rohit Sharma: రోహిత్‌ శర్మపై వేటు.. మూడు వికెట్స్ కోల్పోయిన భారత్!

Rohit Sharma

Rohit Sharma

అందరూ అనుకున్నదే నిజమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌ శర్మకు స్థానం దక్కలేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతోన్న రోహిత్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతిని ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదవ టెస్టులో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగినట్లు బుమ్రా చెప్పాడు. శుభ్‌మన్‌ గిల్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ జట్టులోకి వచ్చారు. రోహిత్ స్థానంలో గిల్, ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్‌ ఆడుతున్నారు.

సిడ్నీ టెస్టులో లంచ్‌ బ్రేక్ ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్ (20) లంచ్‌ బ్రేక్‌కు ముందు ఔటయ్యాడు. లంచ్‌ బ్రేక్‌కు ముందు చివరి బంతికి గిల్ లయ తప్పాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన గిల్ (20) నాథన్‌ లైయన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10) విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (12) నెమ్మదిగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినా జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు లేదు.

తుది జట్లు:
భారత్: యశస్వీ జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, రిషబ్‌ పంత్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ.
ఆస్ట్రేలియా: సామ్‌ కొన్‌స్టాస్‌, ఉస్మాన్‌ ఖవాజా, లబుషేన్‌, స్టీవెన్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, వెబ్‌స్టర్‌, అలెక్స్‌ గ్యారీ, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లయన్‌, స్కాట్‌ బొలాండ్‌.

Show comments