Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌ను కాచుకోవడం నా అదృష్టం: సెంచరీ హీరో
- కొరకరాని కొయ్యగా ట్రావిస్ హెడ్
- విజయాలను దూరం చేస్తున్న హెడ్
- బుమ్రాపై హెడ్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొరకరాని కొయ్యగా మారాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ కొంపముంచిన హెడ్.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనూ విజయాలను దూరం చేస్తున్నాడు. అడిలైడ్ టెస్టులో సెంచరీ చేసిన అతడు బ్రిస్బేన్ టెస్టులో శతకం బాదాడు. వన్డే తరహాలో 160 బంతుల్లో 152 పరుగులు చేశాడు. టీమిండియాకు సింహస్వప్నంలా మారిన హెడ్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుత బౌలర్ అని, మూడో టెస్టు రెండో రోజు ఆటలో అతడి స్పెల్‌ను కాచుకోవడం తన అదృష్టమని హెడ్ పేర్కొన్నాడు.
రెండో రోజు ఆట ముగిసిన అనంతరం ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ… ‘సెంచరీ చేసినందుకు సంతోషంగా ఉంది. అయితే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగులు చేయడం మరింత ఆనందంగా ఉంది. అదృష్టవశాత్తూ బుమ్రా ఉత్తమ స్పెల్‌ను దాటి బ్యాటింగ్ కొనసాగించా. ఆరంభంలో స్టంప్స్‌కు బంతులు వేశాడు. ఆపై బౌన్సర్లు సంధించాడు. బుమ్రా దగ్గర వికెట్లు తీసేందుకు అన్ని అస్రాలు ఉన్నాయి. అతని బౌలింగ్‌లో సానుకూల దృక్పథంతో ఆడాలని చూస్తా. అంటే బుమ్రా బౌలింగ్‌లో పరుగులు చేయాలని కాదు, ఫార్వర్డ్ డిఫెన్స్‌తో బంతిని అడ్డుకోవడం. భారత్‌తో నిత్యం క్రికెట్ ఆడుతూనే ఉంటాం. మంచి జట్టుపై పరుగులు చేయడం బాగుంటుంది. ఈ వారం నా ప్రదర్శన మరింత ప్రత్యేకం అనే చెప్పాలి. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌ను ఆస్వాదించా’ అని చెప్పాడు.
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!