NTV Telugu Site icon

IND vs AUS: పెర్త్‌ టెస్ట్.. రోహిత్‌ శర్మ వచ్చేస్తున్నాడు!

Rohit Sharma Six

Rohit Sharma Six

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్‌లో మొదటి టెస్ట్ ఆరంభం అయింది. ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్ తరఫున నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణాలు అరంగేట్రం చేశారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్‌ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. ఆశ్చర్యకరంగా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చాడు. యువ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు.

తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూరమైన విషయం తెలిసిందే. నవంబర్‌ 15న రోహిత్‌ సతీమణి రితిక మగబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో భార్య చెంత ఉండేందుకు తాను పెర్త్ టెస్టుకు అందుబాటులో ఉండదని బీసీసీఐకి హిట్‌మ్యాన్ చెప్పాడు. రోహిత్‌ గైర్హాజరు నేపథ్యంలో పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. శనివారం రోహిత్‌ ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. నవంబర్ 24న జట్టును కలుసుకోనున్నాడు. తొలి టెస్టు మూడోరోజు నాటికి హిట్‌మ్యాన్ పెర్త్‌కు చేరుకోనున్నాడు. డిసెంబర్‌ 6న అడిలైడ్‌లో ఆరంభమయ్యే రెండో టెస్టులో రోహిత్‌ ఆడతాడు.

Also Read: AUS vs IND: టాస్ గెలిచిన బుమ్రా.. నితీశ్‌ రెడ్డి అరంగేట్రం! సీనియర్స్ అవుట్

పెర్త్‌లో రోహిత్‌ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. రోహిత్ భారత్‌లోనే ఉన్నా.. జట్టు సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని బుమ్రా చెప్పాడు. ఇక భారత జట్టుకు ఈ టెస్ట్ సిరీస్ కీలకం అన్న విషయం తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవాలంటే 4-0తో టీమిండియా గెలవాల్సి ఉంది. అయితే సొంతగడ్డపై న్యూజీలాండ్ చేతిలో ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉంది. అందులోనూ ఫామ్‌ లేమి, గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ఆడుతుందో చూడాలి.

Show comments