IND vs AUS: ఆస్ట్రేలియాకు సూపర్ ట్రాక్ రికార్డు.. వన్డేల్లో భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Australia ODI Head To Head Records:ప్రపంచకప్ 2023కి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ దూరం కాగా.. భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. ఆసియా కప్ 2023 గెలిచిన ఉత్సాహంలో భారత్ బరిలోకి దిగుతున్నా.. ఆసీస్ నుంచి గట్టి పోటీ తప్పదు. ఇక వన్డే సిరీస్ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం.
వన్డేల్లో భారత్‌పై ఆస్ట్రేలియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 146 మ్యాచ్‌లు ఆడగా.. ఆస్ట్రేలియా ఏకంగా 82 మ్యాచ్‌లలో విజయం సాదించింది. భారత్ కేవలం 54 మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. భారత గడ్డపై కూడా టీమిండియాపై ఆసీస్ ఆధిపత్యం చెలాయించింది. స్వదేశంలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 67 మ్యాచ్‌లు జరగ్గా.. 30 మ్యాచ్‌ల్లో భారత్ గెలవగా, 32 మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలిచింది. మరో 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.
Also Read
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
Also Read: IND vs AUS: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విశ్రాంతికి అదే కారణమా?
ఇక నేడు తొలి వన్డే జరగనున్న మొహాలీలో భారత్‌కు చెత్త రికార్డు ఉండగా.. ఆస్ట్రేలియాకు సూపర్ ట్రాక్ రికార్డు ఉంది. మొహాలీలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడిపోయింది. ఈ రికార్డు చూస్తే నేటి మ్యాచ్‌లో భారత్ ఓడడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు స్టార్ ప్లేయర్స్ ముగ్గురు (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా) లేకపోవడంతో భారత జట్టు బలహీనపడింది. మరి నేటి మ్యాచ్‌లో భారత్ గెలిచి ఆస్ట్రేలియాకు షాక్ ఇస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!