IND vs AFG U19: హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ లో భారత అండర్-19 జట్టు విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన భారీ 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 53 బంతులు మిగిలి ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది.
Elon Musk: లారీ పేజ్‌ను అధిగమించి.. $800 బిలియన్లు దాటిన ఎలాన్ మస్క్ సంపద
ఇక మ్యాచ్ విశ్శ్యానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘానిస్థాన్ జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘానిస్థాన్ ఇన్నింగ్స్ లో ఫైసల్ షినోజాదా 93 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. మరోవైపు అతనికి తోడుగా ఉజైరుల్లా నియాజై 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేసి టీమిండియా బౌలర్లు కు పరీక్షగా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ తలో రెండు వికెట్లు తీశారు.
New Electricity Connections: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో కీలక మార్పులు.. రేపటి నుండి అమలు!
ఆఫ్ఘానిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా సాగింది. టీమిండియా డైనమేట్ వైభవ్ సూర్యవంశీ కేవలం 33 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ వైపు పూర్తిగా తిప్పేశాడు. ఆ తర్వాత ఆరన్ జార్జ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి సెంచరీ బాదాడు. ఇక అతనికి తోడుగా కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కూడా 59 బంతుల్లో 62 పరుగులు చేసి విజయానికి సహకరించాడు. చివర్లో విహాన్ మల్హోత్రా అజేయంగా 38 పరుగులతో మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో టీమిండియా అండర్-19 జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్ లో టీమిండియా ఇంగ్లాండ్ తో అమితుమీ తేల్చుకోనుంది.
