Rohit Sharma: మరో 44 పరుగులు.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma needs 44 Runs to become the leading run-scorer among Indian captains: దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలి వేదికగా గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. చాలా నెలల అనంతరం టీ20 జట్టులోకి వచ్చిన ఈ ఇద్దరు ఎలా ఆడతారో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో రోహిత్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ మరో 44 పరుగులు చేస్తే.. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత్ కెప్టెన్‌గా నిలుస్తాడు. ఈ రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ 50 మ్యాచ్‌ల్లో 1570 పరుగులు చేయగా.. రోహిత్ 51 మ్యాచ్‌ల్లో 1552 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ మూడో స్థానంలో ఉన్నాడు. ధోనీ కెప్టెన్‌గా టీ20 క్రికెట్లో 1112 పరుగులు చేశాడు. మూడు టీ20లు కాబట్టి ఈ సిరీస్‌లో రోహిత్ ఈ రికార్డు సాధించే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ ప్రస్తుతం మంచి ఫామ్ మీదున్న విషయం తెలిసిందే.
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
Also Read: Flipkart Sale 2024: ఫ్లిప్‌కార్ట్‌లో ‘రిపబ్లిక్ డే’ సేల్.. ఈ మొబైల్స్‌పై భారీ తగ్గింపు!
మరోవైపు అత్యధిక టీ20 విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలవడానికి రోహిత్ శర్మ మరో మూడు విజయాల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 51 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన రోహిత్.. 39 మ్యాచ్‌ల్లో విజయాలు అందుకున్నాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ (భారత్), అస్గర్ (అఫ్గానిస్థాన్), బాబర్ అజామ్ (పాకిస్థాన్), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్), బ్రెయిన్ మసబా (ఉగాండ) 42 విజయాలతో అగ్రస్థానంలో ఉన్నారు.
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!