NTV Telugu Site icon

Rohit Sharma: ఫ్రస్టేషన్‌లోనే శుభ్‌మన్ గిల్‌ను తిట్టా: రోహిత్

Rohit Gill Run Out

Rohit Gill Run Out

Rohit Sharma Reacts on His Run Out After Shubman Gill Mistake: గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ రెండో బంతికి హిట్‌మ్యాన్ రనౌట్ అయ్యాడు. అఫ్గాన్ పేసర్ ఫజల్హాక్ ఫారూఖీ వేసిన బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా షాట్ ఆడి.. సింగిల్‌కు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇబ్రహీమ్ జద్రాన్ డైవ్ చేసి మరీ బంతిని ఆపాడు. అప్పటికే రోహిత్ రన్ పూర్తి చేశాడు. అయితే నాన్‌స్ట్రైకర్ శుభ్‌మన్ గిల్ మాత్రం బంతినే చూస్తూ.. అక్కడే ఉండిపోయాడు. జద్రాన్ బంతిని వికెట్ కీపర్ గుర్బాజ్‌కు విసరగా.. అతను వికెట్లను గిరాటేశాడు. దీంతో రోహిత్ రనౌట్ అయ్యాడు. హిట్‌మ్యాన్ మైదానం వీడుతూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గిల్‌పై నోరు పారేసుకున్నాడు.

రనౌట్ అయిన ఫ్రస్టేషన్‌లోనే శుభ్‌మన్ గిల్‌పై నోరు పారేసుకున్నానని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తెలిపాడు. ‘ఆటలో రనౌట్ అవ్వడం సహజం. అదే సమయంలో అసహనానికి గురవ్వడం కూడా సర్వసాధారణం. ఫ్రస్టేషన్‌లో శుభ్‌మన్ గిల్‌ను తిట్టాను. ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు మాత్రం కాదు. చాలా రోజుల తర్వాత ఆడున్నప్పుడు ఇలా రనౌట్ అయితే ఎవరైనా అసహనానికి గురవుతారు. నేను ఔటైన తర్వాత గిల్ ఇన్నింగ్స్‌ను నడిపిస్తాడని భావించాను. అయితే దురదృష్టవశాత్తు అతను పెవిలియన్ చేరాడు’ అని రోహిత్ తెలిపాడు. తొలి టీ20లో బౌండరీలు బాదిన గిల్.. స్టంపౌట్ అయ్యాడు.

Also Read: Rohit Sharma Record: టీ20 ఫార్మాట్‌లో రోహిత్‌ శర్మ ప్రపంచ రికార్డు!

రోహిత్ శర్మ మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘మొహాలీ వాతావరణం చాలా చల్లగా ఉంది. క్యాచ్ పటినప్పుడు నా వేలికి గాయమైంది. ప్రస్తుతం బాగానే ఉంది. ఈ మ్యాచ్‌లో అనేక సానుకూలంశాలు లభించాయి. మా బౌలర్లు బంతితో అద్భుతంగా రాణించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిన్నర్లు, పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. శివమ్ దూబే, జితేశ్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్ బాగా ఆడారు. కుర్రాళ్లు ఫామ్‌ను కొనసాగించారు. ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు చేశాం. విభిన్న పరిస్థితుల్లో మా బౌలర్లను ప్రయోగించాం. ఈ క్రమంలోనే సుందర్‌తో 19వ ఓవర్ వేయించాం. రానున్న మ్యాచ్‌ల్లో మా బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేస్తాం. ఫలితంలో తేడా రాకుండా ప్రయోగాలు చేస్తాం’ అని చెప్పాడు.

Show comments