Most Games won in Men’s T20I Cricket: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. గురువారం మొహాలీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించడం ద్వారా రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను 149 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు మాత్రం ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డ్యానీ వ్యాట్ పేరిట ఉంది. ఆమె 111 టీ20ల్లో విజయాల్లో భాగమైంది.
పురుషుల క్రికెట్‌లో రోహిత్ శర్మ తర్వాత ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ బ్యాటర్ షోయబ్ మాలిక్ పేరిట ఉంది. 124 మ్యాచ్‌ల్లో 86 విజయాలలో షోయబ్ బాగమయ్యాడు. రోహిత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక టీ20 విజయాల్లో భాగమైన రికార్డు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. విరాట్ 115 మ్యాచ్‌ల్లో 73 విజయాల్లో బాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ నబీలు చెరో 70 విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Also Read: Poco X6 Launch: పోకో నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. శివమ్ దూబె (60 నాటౌట్; 40 బంతుల్లో 5×4, 2×6), అక్షర్ పటేల్ (2/23) రాణించడంతో తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో రోహిత్ సేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. మహమ్మద్ నబీ (42; 27 బంతుల్లో 2×4, 3×6) టాప్ స్కోరర్. ఒమర్ జాయ్ (29; 22 బంతుల్లో 2×4, 1×6) రాణించాడు. ఆపై లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెల్లడి. రెండో టీ20 ఆదివారం జరుగుతుంది.