NTV Telugu Site icon

IND vs AFG: బౌలింగ్‌ కంటే.. ఫీల్డింగ్‌ చేయడం అంటేనే వణుకు పుడుతోంది!

Untitled Design

Untitled Design

Ravi Bishnoi Jokes on Mohali Weather: మొహాలీ వాతావరణంపై భారత యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చలి వాతావరణంలో బౌలింగ్‌ ఓ పెద్ద సవాల్‌ అని, ఫీల్డింగ్‌ అంతకంటే ఇబ్బంది అని పేర్కొన్నాడు. కెప్టెన్‌కు నమ్మకం ఉన్నప్పుడు ఒత్తిడి తట్టుకొని బౌలింగ్‌ చేయగలం అని, నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తేనే మ్యాచ్‌లో రాణించగలం అని అన్నాడు. ఈరోజు రాత్రి 7 గంటలకు అఫ్గానిస్థాన్‌తో మొహాలీ వేదికగా భారత్ తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ప్రస్తుతం మొహాలీ వాతావరణం క్రికెటర్లకు సవాల్ విసురుతోంది. తీవ్రమైన చలితో ప్లేయర్స్ ఇబ్బందులు పడుతున్నారు. నెట్‌ ప్రాక్టీస్‌లోనూ భారత క్రికెటర్లు గ్లవ్స్‌, కోట్లు ధరించారు.

స్పోర్ట్స్ 18తో రవి బిష్ణోయ్ మాట్లాడుతూ… ‘ఈ చలి వాతావరణంలో బౌలింగ్‌ చేయడం కంటే.. ఫీల్డింగ్‌ అంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఈ వాతావరణంలో బంతిపై నియంత్రణ ఉండదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ కంటే.. ఫీల్డింగ్ చాలా కఠినంగా ఉంటుంది. దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధమయ్యాం. బౌలింగ్‌లో 100 శాతం మా ప్రణాళికలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం. టీ20ల్లో వైవిధ్యమైన బంతులను విసిరాలి. బంతిని ఎక్కువగా గాల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తా. ఎర్ర బంతితోనే ఇలానే ప్రాక్టీస్‌ చేశా. అది ఉపయోగపడుతుందని భావిస్తున్నా. కెప్టెన్‌కు మన మీద నమ్మకం ఉన్నప్పుడు.. ఒత్తిడి తట్టుకొని బౌలింగ్‌ చేయగలం. నెట్స్‌లో శ్రమిస్తేనే మ్యాచ్‌లో రాణించగలం’ అని అన్నాడు.

Also Read: Gunturu Kaaram: ఏంటి అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా! మేకింగ్ వీడియో రిలీజ్

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐస్ బింద్రా స్టేడియంలో ఆడిన అనుభవం రవి బిష్ణోయ్‌కి ఉంది. ఐపీఎల్ సమయంలో మొహాలీలో బిష్ణోయ్ చాలా మ్యాచులే ఆడాడు. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగేతొలి టీ20లో అతడికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. ఓ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఆడనుండగా.. మరో స్థానం కోసం రవి బిష్ణోయ్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్ సుందర్‌ రేసులో ఉన్నారు. బిష్ణోయ్‌భారత్ తరఫున ఒక వన్డే, 21 టీ20లు ఆడాడు. మొత్తంగా 35 వికెట్స్ పడగొట్టాడు.

Show comments