IND vs NZ 2nd Test: న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్.. మహ్మద్ సిరాజ్‌పై వేటు!
- 24 నుంచి రెండో టెస్ట్
- గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్
- తుది జట్టులో మార్పులు
- మహ్మద్ సిరాజ్‌పై వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమితో సిరీస్‌లో 1-0తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. పూణే టెస్టులో గెలవాలని చూస్తోంది. గురువారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. బెంగళూరు టెస్ట్ పరాజయం నేపథ్యంలో తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాదీ పేసర్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి.
విదేశీ పేస్ పిచ్‌లపై రాణించినట్లు స్వదేశీ వికెట్లపై మహ్మద్ సిరాజ్ సత్తా చాటలేకపోతున్నాడు. భారత గడ్డపై 13 టెస్టులాడిన సిరాజ్.. 19 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. విదేశాల్లో 17 టెస్టుల్లోనే 61 వికెట్లు తీశాడు. ఇటీవల భారత పిచ్‌లు కాస్త పేస్‌కు అనుకూలిస్తున్నా.. సిరాజ్ మాత్రం రాణించలేకపోతున్నాడు. కివీస్‌తో తొలి టెస్టులో 2 వికెట్లే తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అయితే ఒక్క వికెట్ పడగొట్టలేదు. బంతితో బ్యాటర్లను ఇబ్బంది పెట్టినా.. వికెట్లను మాత్రం తీయలేకపోయాడు. దాంతో జస్ప్రీత్ బుమ్రాపై ఒత్తిడి నెలకొంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
- BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
- Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
Also Read: Sharvari Wagh: టెన్నిస్ ఆడుతూ.. హీట్ పెంచుతున్న బాలీవుడ్ సెన్సేషన్!
అనుభవం దృష్ట్యా మహ్మద్ సిరాజ్‌కే అవకాశాలు ఇస్తున్నప్పటికీ.. ఫామ్ ప్రకారం చూస్తే ఆకాశ్ దీప్‌కు ఛాన్స్ ఇవ్వాలనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆడిన మూడు టెస్టుల్లో ఆకాశ్ 8 వికెట్లు పడగొట్టాడు. సగటు 23.12గా ఉంది. ఈ మూడు మ్యాచ్‌లూ స్వదేశంలో ఆడినవే కావడం విశేషం. పూణేలోనూ ఇద్దరు పేసర్లే బరిలోకి దిగితే.. జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా ఆకాశ్‌ను ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. జట్టు యాజమాన్యం కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో. కెప్టెన్ రోహిత్ శర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో.
తాజావార్తలు
-
Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
-
Mushtaq Khan: ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత.. 200లకు పైగా సినిమాలు.. హాస్య నటుడిగా చెరగని ముద్ర..
-
BJP: రాహుల్ గాంధీకి అవగాహన లేదు..‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ స్ట్రాంట్ కౌంటర్..
-
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
-
Best Postal Scheme: బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.2 లక్షలకు రూ. 4 లక్షల లాభం..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!