NTV Telugu Site icon

Tomato prices: కొండెక్కిన టమాటా ధరలు..ఇవాళ రేట్ ఎంతో తెలుసా?

Tomoto Today Rate

Tomoto Today Rate

కూరగాయలు (Vegetables) కొనాలంటేనే భయం వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా టమోటా ధరలు (Tomato Prices) ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా టమోటా ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా ఈ సీజన్లో టమోటా ధర చాల తక్కువగా ఉంటుంది. ఒక్కో బాక్స్ ధర రూ. 500 లోపే ఉంటుంది. కానీ ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరిగిన వేడే దానికి కారణమని చెబుతున్నారు. అధిక వేడితో టమాటా దిగుబడులు భారీగా తగ్గాయి. గడిచిన 20రోజుల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో టమాటా ధరలు పెరిగి కిలోకు రూ.50కి వద్ద స్థిరపడ్డాయి. తెలంగాణలో కిలో టమాటా ధర రూ.80కిపైగా పలుకుతోంది.

READ MORE: Kollu Ravindra: గ్రామాల్లో తాగునీటి వనరుల కల్పన కోసం డీపీఆర్ సిద్దం చేయాలి..

రాష్ట్రంలో టమాటా ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇవ్వాళ రైతు బజార్ లోనే 71 రూపాయలు పలికింది. బయట మార్కెట్ లో 100 నుంచి 120 రూపాయలు పలుకుతోంది. ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల టమాటో సాగు తగ్గిందంటున్నారు రైతులు. గత వారం రోజులుగా 50రూపాయలకు పైనే ఉంది. రైతు బజార్ లో 70-75 రూపాయల వరకు అమ్ముతున్నారు. రిటైల్ మార్కెట్లలో విపరీతమైన ధరలు ఉంటున్నాయని విక్రయదారులు అంటున్నారు. తెలంగాణలో కూరగాయల పంటలు సరిగ్గా పండకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి మీద ఆధారపడాల్సి వస్తోందని రైతులు తెలిపారు. ఒక నెల రోజులపాటు ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. వర్షాలు జోరందుకుంటే.. ధరలు దిగివచ్చే అవకాశం ఉంది.