NTV Telugu Site icon

Warangal: వరంగల్‌ కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు.. కొండా-రేవూరి వర్గం మధ్య తీవ్ర ఘర్షణ..

Warangal

Warangal

వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయటకు వచ్చాయి. కొండ వర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొండా వర్గం రేవూరి వర్గం మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. దసరా బతుకమ్మ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి పేరు లేకపోవడంతో వివాదం మొదలైంది.
ఎమ్మెల్యే పేరు పెట్టాలంటూ కొండ వర్గానికి రేవూరి అనుచరులు సూచించారు. రేవూరి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు పెట్టడంతో ఫ్లెక్సీలను చించేశారు. ఫ్లెక్సీలు చించి వేసారంటూ రేవూరి అనుచరులపై కొండ వర్గం దాడికి పాల్పడ్డారు. దీంతో గాయాల పాలైన రేవూరి అనుచరులు కొండ వర్గంపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కొండ అనుచరులను అరెస్ట్ చేశారు.

READ MORE: Mahabubabad District : సర్వీస్ గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..

ఆధారాలు లేకుండానే తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ కొండ అనుచరులు పేర్కొన్నారు.. గీసుకొండా పోలీస్ స్టేషన్ పరిధిలో 16వ డివిజన్ నర్సంపేట రహదారిపై కొండా వర్గం ధర్నాకు దిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమ వర్గానికి చెందిన కార్యకర్తలను విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సమస్య వివాదాస్పదం కాకుండా రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ ధర్నాతో మరోసారి కొండ, రేవూరి ఆధిపత్య పోరు మరోసారి బట్టబయలైంది.