Site icon NTV Telugu

Maharashtra Leaders: సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

Maharastra Leaders

Maharastra Leaders

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో ఉండగానే మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్రకు చెందిన నేతలు బీఆర్ఎస్ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ( శనివారం) మహారాష్ట్రకు చెందిన బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా కండువా కప్పి వారికి సాదర స్వాగతం పలికారు.

Read Also: Railway Station turns into Swimming Pool: రైల్వే స్టేషన్‌ మాయం.. స్విమ్మింగ్ పూల్‌ ప్రత్యక్షం.. వదిలేస్తామా ఏంటి..?

పుట్టిన గడ్డ తెలంగాణ అయితే పెంచిన తల్లి మహారాష్ట్ర అని దశరథ్ అనే నేత అన్నారు. షోలాపూర్ లో చాలా వరకు తెలుగు వారు ఉంటారని అతడు చెప్పారు. మహారాష్ట్రలో బాంబే, షోలాపూర్, పుణే లాంటి నగరాలలో బీఆర్ఎస్ ట్రెండ్ స్టార్ట్ అయిందన్నారు. కొన్ని నెలల కిందట మీతో సమావేశం అయినప్పుడు బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గతంలో తన తండ్రి బీజేపీ తరఫున ఓసారి ఎమ్మెల్యే, 2 పర్యాయాలు ఎంపీగా చేశారని గుర్తుచేశారు దశరథ్ అన్నారు. 4 నెలల కిందట నేను బీఆర్ఎస్ లో జాయిన్ అవుతానని అనుకోలేదు.. కానీ ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి మారిపోయిందన్నాడు.

Read Also: ChatGPT: అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..

తన తండ్రి మహారాష్ట్ర నుంచి బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు.. ఎన్నో ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశారని బీఆర్ఎస్ లో చేరిన నేత దశరథ్ అన్నాడు. ఎన్సీపీ నేతలను సైతం ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ తెలంగాణలో తీసుకొచ్చిన పథకాలు మహారాష్ట్రలో అమలు చేస్తే బాగుంటుందని తెలిపాడు. కొన్ని ప్రాంతాల్లో వారినికి ఒకసారి తాగునీళ్లు వస్తాయన్నారు.. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో బీజేపీని వదిలి బీఆర్ఎస్ లో చేరినట్లు పలువురు నేతలు పేర్కొన్నారు.

Exit mobile version