Site icon NTV Telugu

Virat Kohli: ఏంటి ‘కింగ్’ ఐపీఎల్లో అలా.. ఇక్కడేమో ఇలా..

Virat Kohli Icc Award

Virat Kohli Icc Award

ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చూపించిన కింగ్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్లోనే నిరాశపరిచాడు. మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీపై.. టీమిండియ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. నిన్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఓపెనర్గా బరిలోకి దిగాడు. కానీ.. అనుకున్నంత స్థాయిలో ఆడలేక అభిమానులను నిరాశపరిచాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అది కూడా.. పెద్ద టీమ్ బౌలర్లు కూడా కాదు.. పసికూన ఐర్లాండ్ బౌలర్లకే కోహ్లీ తడబడ్డాడు. 5 బంతులు ఆడిన కోహ్లీ.. మార్క్ అడైర్‌ ఓవర్‌లో క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు.

Brahmaji : వాళ్ళు తప్పు చేస్తే మీరు అదే తప్పు చేయకూడదు.. ఏపీ పాలిటిక్స్ పై బ్రహ్మాజీ హాట్ కామెంట్స్

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ 50 కంటే తక్కువ పరుగులు సాధించడం 8 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2016లో న్యూజిలాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 23 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ 50 కంటే తక్కువ పరుగులు చేయలేదు. అయితే.. ఐపీఎల్ లో అదరగొట్టి, ఇప్పుడు బెదరగొడుతున్నందుకు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న టీమిండియాతో పాటు అభిమానులు.. గేర్ మార్చాలని అంటున్నారు. కోహ్లీ బ్యాటింగ్ రికార్డు విషయానికొస్తే.. టీ20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో అద్భుతంగా ఉంది. ఛేజింగ్‌లో అతడి సగటు ఏకంగా 180.66గా ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 542 పరుగులు సాధించాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 82 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 134.49గా ఉండగా.. 49 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి.

Chandrababu: ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కాగా.. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ 2024కప్ న్యూయార్క్‌లో జరుగుతుంది. బుధవారం రాత్రి నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్లు చెలరేగడంతో.. టీమిండియా 8 వికెట్ల తేడాతో ప్రపంచ కప్‌లో బోణీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 96 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ, రిషబ్ పంత్ రాణించడంతో భారత్ అలవోక విజయం సాధించింది.

Exit mobile version