T20 World cup 2024 : ప్రస్తుతం అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టి20 ప్రపంచ కప్ 2024లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం ఉదాంతం వినపడుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసమని కెన్యా దేశానికి చెందిన ఓ మాజీ క్రికెటర్ ఓ ఉగాండా ఆటగాడిని సంప్రదించాడనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ఉగాండా ఆటగాడు ఐసీసీ అవినీతి నిరోధక విభాగాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్ లో ఉగాండా గయానా వేదికగా నాలుగు లీగ్ మ్యాచ్లు ఆడి టోర్నీ నుంచి వైదొలిగింది.
Sikkim Tourists: సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యటకులు సేఫ్..
అయితే ఈ మూడు మ్యాచ్లలో ఎలాగైనా ఫిక్సింగ్ చేయించాలని ఓ కెన్యా మాజీ ఆటగాడు పలుమార్లు వేరువేరు ఫోన్ నెంబర్లతో ఉగాండా ఆటగాడిని సంప్రదించారని సమాచారం. ఈ విషయాన్ని తాజాగా ఐసీసీకి చెందిన ఓ అధికారి మీడియాకి తెలిపారు. కాకపోతే., ఈ ఉదాంతంలో ఎవరి ఆటగాళ్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు. అయితే ఇలా చిన్న దేశాల ఆటగాళ్లను టార్గెట్ చేయడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని., పెద్ద జట్టు ఆటగాళ్లతో పోలిస్తే ఇలాంటి చిన్న దేశాల ఆటగాళ్లను వలలో వేసుకోవడం సులువని కొందరు బుక్కిలు ఇలా ప్రయత్నం చేస్తున్నారు.
Sangeetha: పెళ్లికి ముందు తండ్రి మృతి.. నన్ను దారుణంగా ట్రోల్ చేశారు.. నటి ఆవేదన!
అయితే, ఈ విషయంపై ఉగాండా ఆటగాడు వీలైనంత త్వరగా ఆ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు తెలపడంతో చాలా మంచి పని చేశాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ వర్గాలు వీలైనంత త్వరగా విచారణ చేపడతామని., అందుకు తగ్గ ఆధారాలు లభిస్తే మాత్రం.. నిందితులను కచ్చితంగా శిక్షిస్తామని వారు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో ఉగండా గ్రూప్ సీలో ఉండగా.. మొత్తం నాలుగు మ్యాచ్లు ఆడగా అందులో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి టోర్నీ నుండి నిష్క్రమించింది.