మాజీ ఎమ్మెల్యేలకు నెలవారీ పెన్షన్‌ను రూ.50 వేలకు పెంచుతున్నట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.22 వేలు పింఛన్ అందుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. ఆదివారం రాజధాని గ్యాంగ్‌టక్‌లో జరిగిన మాజీ ఎమ్మెల్యేల సమాఖ్య (ఎఫ్‌ఎల్‌ఎఫ్‌ఎస్) 22వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేల పెన్షన్‌ను పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు.
Read Also: Vande Bharat Express: ఏలూరులో తొలిసారి ఆగిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ఈ సందర్భంగా సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలుగా ఒక పర్యాయం పూర్తి చేసిన మాజీ ఎమ్మెల్యేలకు ఇకపై నెలకు రూ.50 వేలు పింఛను అందజేస్తామన్నారు. ప్రస్తుతం నెలకు రూ.22వేలు పింఛను పొందుతున్నారన్నారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు రూ.25,000 బదులుగా రూ.55,000 పెన్షన్ లభిస్తుందని తమంగ్ చెప్పారు. సిక్కిం మాజీ ఎమ్మెల్యేల సంఘానికి సిక్కిం ప్రభుత్వం ఏటా రూ.20 లక్షల గ్రాంట్-ఇన్-ఎయిడ్ అందజేస్తుందని సీఎం ప్రకటించారు. ఈ ఫండ్ మాజీ ఎమ్మెల్యేల అత్యవసర, వైద్య అవసరాలను తీర్చడానికి.. వారి సహాయ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు.
Read Also: WTC Points Table: ఒక్క గెలుపుతోనే మార్పులు.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన బంగ్లాదేశ్
