NTV Telugu Site icon

Samosa: సమోసాల్లో కండోమ్‌లు, గుట్కాలు.. అవి తిన్న వారికి..?!

3

3

పూణేలోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్‌ లో వడ్డించే సమోసాలలో కండోమ్‌లు, గుట్కా, రాళ్లు లభ్యమైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలోని పింప్రి-చించ్వాడ్‌ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు రహీం షేక్, అజర్ షేక్, మసర్ షేక్, ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆటోమొబైల్ సంస్థ క్యాంటీన్ కు స్నాక్స్ ను సరఫరా చేస్తోంది. అయితే తాజాగా సమోసాల సరఫరా కాంట్రాక్టును మనోహర్ ఎంటర్ ప్రైజెస్ అనే మరో సబ్ కాంట్రాక్టు సంస్థకు కేటలిస్ట్ కంపెనీ అప్పగించింది. ఈ సబ్ కాంట్రాక్టు సంస్థ సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్స్, గుట్కా, రాళ్లు లభ్యమయ్యాయి. దీంతో ఆటోమొబైల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ

విచారణలో మనోహర్ ఎంటర్ప్రైజెస్ లో పనిచేస్తున్న ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ లు సమోసాలలో కండోమ్లు, గుట్కా, రాళ్లు నింపినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు వారిని ప్రశ్నించారు. మనోహర్ ఎంటర్ప్రైజెస్ పరువు తీసేందుకే అలా చేశామని నిందితులు అంగీకరించారు. నిందితులు ఎస్ఆర్ఎ ఎంటర్ప్రైజెస్ అనే మరో కంపెనీ ఉద్యోగులని, గతంలో కాంట్రాక్టు పద్ధతిలో చిరుతిళ్లను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆహారంలో కల్తీ చేసిన వారిపై, అలా నియమించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read: Unstoppable 4: బాలయ్య మళ్లీ వస్తున్నాడు గెట్ రెడీ

ఇకపోతే సదరు సమోసాలు తిని అస్వస్థతకు గురైన ఆ కంపెనీ ఉద్యోగులను వారి యాజమాన్యం ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పించింది. ఇకపోతే, ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలియడంతో అంతా ఊపిరి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విషయం వైరల్ కావడంతో.. ఇలా తినే తిండి పదార్థాలలో అలాంటి వస్తువులు పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో తెగ విమర్శలు వస్తున్నాయి. చూడాలిమరి ఈ విషయంపై అక్కడి అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారో.

Show comments