NTV Telugu Site icon

Rajayasabha: తొలిసారిగా రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ స్థానాలు..

Rajayasabha

Rajayasabha

Rajayasabha: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్. తాజాగా జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్‌ లభించింది. ఈ మెజారితో పార్లమెంటు ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం కానుంది. ఇకపోతే, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోటీలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ 12 స్థానాలకు గాను కేవలం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభ్యర్థులే 11 స్థానాల్లో విజయం సాధించారు. ఒక్క స్థానంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ లెక్కలతో ఎగువసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ స్థానాల మార్కును అధిగమించింది. ఇకపోతే ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ రావడం చరిత్రలో ఇదే మొదటిసారి.

ఇకపోతే రాజ్యసభలో కొత్తగా చేరిన 12 మంది సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి..

బీజేపీ అభ్యర్థులు:

* అస్సాం నుంచి మిషన్ రంజన్ దాస్, రామేశ్వర్ తేలీ.

* బీహార్ నుంచి మనన్ కుమార్ మిశ్రా.

* హర్యానా నుంచి కిరణ్ చౌదరి.

* మధ్యప్రదేశ్ నుంచి జార్జ్ కురియన్.

* మహారాష్ట్ర నుంచి ధైర్యషీల్ పాటిల్.

* ఒడిశా నుంచి మమతా మొహంతా.

* రాజస్థాన్ నుంచి రవ్‌నీత్ సింగ్ బిట్టు.

* త్రిపుర నుంచి రాజీవ్ భట్టాచార్జీ.

* మహారాష్ట్ర నుంచి బీజేపీ మిత్రపక్షాల నితిన్ పాటిల్,

* బీహార్ నుంచి ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు.

* తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ విజయం సాధించారు.