Paris Paralympic Games 2024: పారిస్ పారాలింపిక్స్ 2024 లో శనివారం భారత్ 2 పతకాలు సాధించింది. దింతో భారత జట్టుకు 29కి పతకాల సంఖ్య చేరింది. 200 మీటర్ల టి-12 ఈవెంట్‌లో సిమ్రాన్ తొలి పతకాన్ని సాధించింది. కాంస్య పతకాన్ని సాధించింది. దీని తర్వాత, పురుషుల జావెలిన్ త్రో F-41 ఫైనల్‌లో నవదీప్ సింగ్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దింతో భారత్ 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు సాధించింది. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
పాయింట్ల పట్టికలో భారత్ స్థానం..?
పాయింట్ల పట్టికలో భారత్ 16వ స్థానంలో ఉంది. 216 పతకాలతో చైనా మొదటి స్థానంలో ఉంది. గ్రేట్ బ్రిటన్ 120 పతకాలతో రెండో స్థానంలో ఉంది. అమెరికా 102 పతకాలతో మూడో స్థానంలో ఉంది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ 19 పతకాలు సాధించింది. అయితే, నవదీప్ చాలా నాటకీయంగా గోల్డ్ మెడల్ సాధించాడు. స్వర్ణ పతకం సాధించిన ఇరాన్ ప్లేయర్ బీత్ సయా సదేగ్ అభ్యంతరకర జెండాను పదే పదే ప్రదర్శించడంతో అనర్హుడిగా ప్రకటించబడ్డాడు. దాంతో అతడికి రావలిసిన గోల్డ్ ను కాస్త రెండో స్థానంలో ఉన్న నవదీప్ కు ఇచ్చారు. ఇకపోతే ఆఖరి మ్యాచ్‌లో నవదీప్ తొలి ప్రయత్నాన్ని ఫౌల్ చేశాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 46.39 మీటర్లు విసిరాడు. దీని తర్వాత, ఈ ఆటగాడి మూడవ ప్రయత్నం 47.32 మీటర్ల దూరంలో ఉంది. సదేగ్ తన ఐదో ప్రయత్నంలో నవదీప్‌ను వెనక్కి నెట్టి 47.64 మీటర్లు విసిరి రికార్డు సృష్టించాడు. నవదీప్ గతంలో టోక్యో పారాలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. గతేడాది హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో కూడా ఈ ఆటగాడు నాలుగో స్థానంలో నిలిచాడు.
Paralympics 2024: భారత్ సిల్వర్ గెలిస్తే గోల్డ్ వచ్చింది.. కారణం ఏంటంటే?
ఐకమరోవైపు., ఫైనల్ మ్యాచ్‌లో సిమ్రాన్ కేవలం 24.75 సెకన్లు పట్టి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ సమయంలో అతని గైడ్ అభయ్ సింగ్ కూడా పాల్గొన్నాడు. T-12 వర్గం దృష్టి లోపం ఉన్న రన్నర్‌ల కోసం నిర్వహిస్తారు. ఇందులో ప్లేయర్‌తో పాటు గైడ్ కూడా పాల్గొంటారు. ఈ పతకం ఈ విభాగంలో భారతదేశానికి మొదటిది. పారాలింపిక్స్‌లో ట్రాక్ ఈవెంట్‌లలో మొత్తంగా నాల్గవ పతకం. ఇవన్నీ ప్రస్తుత ఎడిషన్‌లో వచ్చాయి. ప్రీతీ పాల్ తొలి పతకం సాధించింది.
Moeen Ali Retirement: మొయిన్ అలీ సంచలన నిర్ణయం.. ఈసారి వెనక్కి తీసుకోనంటూ పోస్ట్!
ఇక నవదీప్ కోసం, “ఇన్‌క్రెడిబుల్ నవదీప్ పారాలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో F-41 ఈవెంట్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతని విజయం అతని అసాధారణ స్ఫూర్తికి ప్రతిబింబం. అతనికి అభినందనలు. భారతదేశం సంతోషంగా ఉంది” అని ప్రధాని రాశారు. అలాగే సిమ్రాన్ కోసం, “మహిళల T12 200m ఈవెంట్‌లో కాంస్యం గెలిచినందుకు సిమ్రాన్ శర్మకు అభినందనలు. ఆమె విజయం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. శ్రేష్ఠత, నైపుణ్యం పట్ల ఆమె నిబద్ధత గొప్పది.” అని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
Congratulations to Simran Sharma as she wins a Bronze medal in the Women's 200M T12 event at the #Paralympics2024! Her success will inspire several people. Her commitment towards excellence and skills are noteworthy. #Cheer4Bharat pic.twitter.com/naFECcPCY7
— Narendra Modi (@narendramodi) September 7, 2024
The incredible Navdeep has won a Silver in the Men’s Javelin F41 at the #Paralympics2024! His success is a reflection of his outstanding spirit. Congrats to him. India is delighted. #Cheer4Bharat pic.twitter.com/NfziEdoCbQ
— Narendra Modi (@narendramodi) September 7, 2024