NTV Telugu Site icon

Odisha: ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేదు..ఇంటి నుంచే పనిచేసిన మాజీ సీఎం

New Project (9)

New Project (9)

జూన్ 4న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అందరి ముందు రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటిది- రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రెండోది – సీఎం ఎక్కడ ఉంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది. బీజేపీ మోహన్ మాఝీని ముఖ్యమంత్రిని చేసింది. అయితే రెండో ప్రశ్నకు సమాధానం ఇంకా వెతుకుతూనే ఉంది. నిజానికి ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేదు. 24 ఏళ్ల పాటు ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ మాత్రమే చేశారు. తన సొంత పూర్వీకుల ఇంటిని ముఖ్యమంత్రి నివాసంగా చేసుకుని ఇక్కడి నుంచే అన్ని పనులు నిర్వహించేవారు.

READ MORE: RBI: ఆర్బీఐ సంపాదనలో గణనీయమైన పెరుగుదల..పాకిస్తాన్ జీడీపీ కంటే 2.5 రెట్లు ఎక్కువ

ఇప్పుడు దీని కారణంగా, కొత్త ముఖ్యమంత్రి కోసం ప్రభుత్వ నివాసం వెతుకుతోంది. ఒడిశాలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలోని 147 స్థానాలకు గాను 78 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కాగా, నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) 51 సీట్లకు తగ్గింది. కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంది. బీజేపీ మోహన్ మాఝీని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మాఝీ బుధవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కేవీ సింగ్ దేవ్, ప్రవతి పరిదా డిప్యూటీ సీఎంలు అయ్యారు. అయితే ఒడిశాలో ముఖ్యమంత్రికి ప్రభుత్వ నివాసం లేకపోవడమే సమస్యగా మారింది.

READ MORE: Viral video: ఎయిర్‌పోర్టులో యువతి డ్యాన్స్.. అవాక్కైన ప్రయాణికులు

2000 సంవత్సరంలో, నవీన్ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి అయినప్పుడు.. అతను ప్రభుత్వ నివాసంలో కాకుండా తన వ్యక్తిగత నివాసం నుంచి పని చేయాలని నిర్ణయించుకున్నారు. దాని పేరు ‘నవీన్ నివాస్’గా పెట్టుకున్నారు. 24 ఏళ్లపాటు ఒడిశా అధికార కేంద్రంగా ‘నవీన్ నివాస్’ కొనసాగింది. అన్ని అధికారిక, పరిపాలనా పనులు ఇక్కడ నుంచే జరిగాయి. పట్నాయక్ పూర్వీకుల ఇల్లు కటక్‌లో ఉంది. నవీన్ పట్నాయక్ పుట్టింది ఇక్కడే. తరువాత, భువనేశ్వర్ ఒడిశా రాజధాని అయినప్పుడు, బిజూ పట్నాయక్ ఇక్కడ ఒక బంగ్లాను నిర్మించారు. దానికి నవీన్ నివాస్ అని పేరు పెట్టారు.

నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కాకముందు.. హేమానంద బిస్వాల్, జెబి పట్నాయక్ భువనేశ్వర్ క్లబ్ సమీపంలోని ఒకే అంతస్థుల భవనం నుంచి పని చేసేవారు. 1995లో జేబీ పట్నాయక్ మళ్లీ ముఖ్యమంత్రి కాగానే సీఎం నివాసాన్ని రెండంతస్తుల భవనానికి మార్చారు.
2000లో, నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి అయ్యాక, ఆ రెండంతస్తుల భవనాన్ని సీఎం గ్రీవెన్స్ సెల్‌గా మార్చారు.