NTV Telugu Site icon

Viral Video : గాలిలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం..

Viral Flights Crash Copy

Viral Flights Crash Copy

A Delta and American Airlines flight came within feet’s distance video goes viral : తాజాగా ఆకాశంలో తృటిలో ఓ ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలు చాలా దెగ్గరకు రావడంతో అవి ఢీ కొట్టుకున్నాయా అన్నట్టుగా విమానాలు దెగ్గరకు వచ్చాయి. ల్యాండ్‌ కాబోతున్న ఓ విమానం, టేకాఫ్‌ అయిన ఇంకో విమానం గాలిలో ఢీ కొట్టుకోబోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఘటనకు సంబంధిత వివరాల ప్రకారం.. అమెరికాలోని న్యూయార్క్‌ లో సిరక్యూస్ హాన్‌ కాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్‌ లో జూలై 8వ తేదీన ప్రధాన వాణిజ్య విమానయాన సంస్థలకు చెందిన 2 విమానాలు ఢీ కొట్టుకోబోయాయి.

Rohit Sharma Prize Money: రాహుల్‌ ద్రవిడ్‌ కంటే ముందే.. రూ.5 కోట్లు వదులుకునేందుకు సిద్దమైన రోహిత్‌!

ఈ ఘటనలో ఎయిర్‌ పోర్ట్‌ లో కంట్రోలర్లు ముందుగా అమెరికన్ ఈగిల్ ఫ్లైట్ AA5511, PSA ఎయిర్‌ లైన్స్ లో పాల్గొన్న బొంబార్డియర్ CRJ – 700ను రన్వే 28 లో ల్యాండ్ కావడానికి క్లియరెన్సు ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటకే అధికారులు డెల్టా కనెక్షన్ DL5421, ఎండీవర్ ఎయిర్ నిర్వహిస్తున్న మరో సీజ్ 700కి అదే రన్వే నుండి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. దింతో ఈ 2 విమానాలు ఆకాశంలో ఒక్కసారిగా చాలా సమీపానికి వచ్చారు. ఆ సమయంలో ఆ 2 విమానాలు ఢీకొట్టుకునేంత పనైంది. ఈ ఘటనకు సంబంధించిన ఫ్లైట్‌ రాడార్‌ 24 వెబ్‌సైట్ ప్రకారం.., 2 విమానాలు ఒకదానికొకటి నిలువుగా 700 నుండి 1000 అడుగుల దూరంలోకి రాసాగాయి. ఆ సమయంలో డెల్టా విమానంలో 76 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా., మరో విమానం అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో కూడా 75 మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక మొత్తానికి అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Lavanya: రాజ్‌తరుణ్‌తో అరియానా ఎఫైర్‌.. లావణ్య సంచలన వ్యాఖ్యలు