NTV Telugu Site icon

Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో అట్రాక్షన్గా పూసలమ్మాయి..అసలు మైండ్లోంచి పొవట్లేదుగా!

Monalisa

Monalisa

Maha Kumbh Mela 2025: మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయోగ్ రాజ్ లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లది మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే, అఘోరీలు, నాగ సాధులు, రుషులతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అయితే, ఈ కుంభమేళాలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు ‘మోనాలిసా’. ఆమె ఇండోర్‌కు చెందిన యువతి. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో నేచురల్ అందంతో ఆకట్టుకుంటున్న మోనాలిసా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్‌గా మారింది. ఆమె కాటుక పెట్టిన తేనె కళ్లతో, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె లుక్‌లో ఉన్న ఆ చక్కని చిరునవ్వు, చూస్తే చూడాలనిపించే అందం, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుత కుంభమేళలో ఆమె ఫొటోలు, వీడియోలు తెగ వైరల్‌గా మారాయి.

Also Read: Vaikuntha Dwara Darshan: శ్రీవారి ఆలయంలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనాలు!

ఇకపోతే, మోనాలిసా కుంభమేళాలో పూల దండలు, రుద్రాక్షలను విక్రయిస్తూ భక్తులకు అందిస్తోంది. ఆమె తన స్వభావంతో కూడా చాలా ఇన్నొసెంట్‌గా కనిపిస్తోంది. ఇక కొందరు ఔత్సహికులు ఆమెతో మాట్లాడానికి ప్రయత్నించి వీడియోలు కూడా తీసుకున్నారు. వీటిని చుసిన కొందరు ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయిన అనుభవం కలుగుతుందని.. ఆమె ప్రతి చర్యలోనూ ఒక ఆధ్యాత్మికత, ప్రపంచానికి చెందిన ఒక సరళత కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె వీడియోలు, ఫొటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Also Read: Mahakumbh 2025 : మహా కుంభ మేళాకు తరలి వస్తున్న కోట్లాది మంది భక్తులు.. వాళ్లను ఎలా లెక్కిస్తారు ?

ముఖ్యంగా ఆమె కళ్లకు సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. “ఆ కళ్లు ఎంత అందంగా ఉన్నాయి” అంటూ నెటిజన్లు పెద్దెత్తున కామెంట్లు చేస్తున్నారు. ఈ కుంభమేళాలో ప్రస్తుతం హర్ష రిచారియా తర్వాత మోనాలిసా తన అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వివిధ మీడియా సంస్థలు పోటీపడుతున్నాయి. మొత్తంగా, కుంభమేళ లో మోనాలిసా తన చక్కని కళ్లతో, నేచురల్ అందంతో ఒక రేంజ్‌లో సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోయింది.