Site icon NTV Telugu

Madhya Pradesh: దారుణం.. దుర్మార్గుడి చేతిలో బతికుండగానే నరకం చూసిన యువతి.. చివరకి..

12

12

ఈ మధ్యకాలంలో కొందరు మనుషుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచుగా చూస్తూ ఉన్నాం. తాజాగా ఓ నరరూప రాక్షసుడి చేతిలో యువతి చిత్రవధ అనుభవించింది. మాటల్లో చెప్పలేనంత నరకాన్ని చూసింది. సదరు మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. నీళ్ల పైపు, బెల్టు ఇలా ఏది దొరికితే దానితో ఇష్టం వచ్చినట్లు కొట్టి పచ్చిపండులా ఆవిడ శరీరాన్ని తయారు చేశాడు దుర్మార్గుడు. అంతేకాదు ఆ గాయాలపై కారంపొడి చల్లి ఆమెకి నరకయాతనను చూపించాడు.

Also read: Saurabh Bhardwaj: కేజ్రీవాల్ను చంపేందుకు జైల్లో కుట్ర జరుగుతుంది..

ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. మధ్యప్రదేశ్ లోని గుణ ప్రాంతంలో శివపురిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నెల రోజులపాటు ఆ యువతి పై సదరు వ్యక్తి క్రూరంగా వ్యవహరించాడు. 23 ఏళ్ల బాధిత మహిళ నిందితుడి పక్క ఇంట్లో ఉండే వ్యక్తి. ఒకరోజు ఆవిడ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను బలవంతంగా ఎత్తుకు వెళ్లి తన ఇంట్లో ఓ గదిలో నిర్బంధించాడు. ఆ తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబానికి సంబంధించిన ఆస్తి పై తన పేరు రాయించాలని దారుణానికి ఒడిగట్టాడు.

Also read: K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్‌ పై లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

అయితే కాలం కలిసి వచ్చి., ఆ అమ్మాయి అతడు చెర నుంచి తప్పించుకొని ఎలాగోలాగా అర్ధరాత్రి ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి ఓ పోలీస్ స్టేషన్ కు చేరుకొని అక్కడ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు.

Exit mobile version