Site icon NTV Telugu

Dispute : అత్తను చంపి అడ్డులేదనుకుంది.. సీన్ రివర్స్ అవుతుందని ఊహించలేకపోయింది

Murder

Murder

Dispute : అత్తకోడళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉప్పు నిప్పులా చెరోవైపు ఉంటారన్నది జగమెరిగిన సత్యం. అత్త చేసిన పని కోడలికి నచ్చదు.. కోడలి పనితీరు అత్తకు నచ్చదు. ఇది దాదాపు ఏ ఇంట్లోనైనా ఉండే సమస్య. కాక పోతే ఇక్కడ ఓ అత్తకోడళ్ల మధ్య వివాదం హత్యకు దారితీసింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లా చైన్‌పూర్‌లోని దాత్రా గ్రామంలో చోటుచేసుకుంది.

Read Also:Bride Groom : రిసెప్షన్లో రెచ్చిపోయిన వరుడు.. గొడ్డళ్లతో దాడి

ఓడిల్ కెర్కెట్టా అనే మహిళకు ముగ్గురు కుమార్తెలు. కోడలికి మగసంతానం లేకపోవడంతో అత్త, కోడలు మధ్య రోజూ గొడవలు జరుగుతుండేవి. ఈ గొడవతో విసిగి వేసారిపోయిన కోడలికి కోపం పెరిగి అత్తగారిని తీవ్రంగా కొట్టింది. ఇది కూడా ఆమె మనసుకు సంతృప్తినివ్వకపోవడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఆమె అత్తను చంపేసింది. ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని ఓడిల్ కెర్కెట్టాగా, మృతుడి అత్తను బిబయాని కెర్కెట్టాగా గుర్తించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also:Keerthy Suresh: ఆ డాన్స్ వెనక 25 టేక్స్… అట్లుంటది కీర్తి సురేష్ డెడికేషన్

అసలేం జరిగిందంటే.. గురువారం సాయంత్రం మృతురాలి కుమారుడు జైమన్ కెర్కెట్‌ మార్కెట్‌కు వెళ్లాడు. ఇంతలో అత్త బిబయాని కెర్కెట్టా, కోడలు ఒడిల్ కెర్కెట్టా కొన్ని కారణాల వల్ల గొడవ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది. ఈ సమయంలో కోడలు ఒడిలే 65 ఏళ్ల అత్తగారిని తీవ్రంగా కొట్టి చంపింది.. ఈ ఘటన తర్వాత కుటుంబసభ్యులు విషయాన్ని దాచాలని ప్రయత్నించారు. చనిపోయిన మహిళకు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గ్రామస్థుడు హత్య గురించి చైన్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాత్రా గ్రామానికి చేరుకుని అత్త మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం గుమ్లా సదర్ ఆసుపత్రికి తరలించారు. నిందితురాలైన కోడలిను పోలీసులు కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version