NTV Telugu Site icon

Andhra Pradesh: ఈత సరదా.. రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు యువకులు గల్లంతు

Swimming

Swimming

ఈత సరదా ఇద్దరి యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఆర్కే బీచ్‌లో విషాదం నెలకొంది. కొందరు ఇంటర్మీడియట్ విద్యార్థులు సరదాగా ఆర్కే బీచ్‌కు వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానానికి దిగారు. మొత్తం 11 మంది విద్యార్థులు బీచ్‌కు రాగా.. అందులో ఆరుగురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. అయితే సముద్రంలో అలల ధాటికి నిఖిల్ (18) అనే విద్యార్థి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో.. విద్యార్థి నిఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి కోసం వెతికే పనిలో పడ్డారు.

Read Also: Sonia Gandhi: ‘‘పాపం రాష్ట్రపతి’’.. సోనియా గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

మరోవైపు.. అన్నమయ్య జిల్లా గాలివీడులో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం స్నేహితులతో కలిసి గండిమడుగు నది వద్దకు వెళ్లిన ఓ యువకుడు.. నదిలో ఈత కొడుతూ గల్లంతయ్యాడు. దీంతో.. యువకుడు ఆచూకీ కోసం అగ్నిమాపక, పోలీసు సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గంటల తరబడి నదిలో ముమ్మరంగా గాలించి యువకుడి మృతదేహాన్ని కనుగొన్నారు. మృతుడు బీహార్కు చెందిన ధీరజ్ కుమార్ (25)గా పోలీసులు గుర్తించారు. మృతుడు వెలిగల్లు సోలార్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also: Ola Electric: ఓలా నుంచి 8 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఫీచర్స్ నెక్ట్స్ లెవల్‌.. తక్కువ ధరలోనే