Elections In AP: ఆంధ్రప్రదేశ్‌లో నేడు (ఫిబ్రవరి 3)న 10 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీ సీట్లను కాపాడుకోవాలని, వైసీపీ వీటిని గెలుచుకోవాలని వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తున్నాయి. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Also Read: Municipal Chairperson: నేడు హిందూపురంలో 144 సెక్షన్..
తిరుపతి కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్, ఏలూరు కార్పొరేషన్ లలో డిప్యూటీ మేయర్లకు ఎన్నికలు జరగనుండగా.. నందిగామ మున్సిపాలిటీ, హిందూపురం మున్సిపాలిటీ, పాలకొండ మున్సిపాలిటీ లలో చైర్ పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయి. అలాగే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, నూజివీడు మున్సిపాలిటీ, తుని మున్సిపాలిటీ, పిడుగురాళ్ల మున్సిపాలిటీ లలో వైస్ చైర్ పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తన సీట్లను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో పార్టీ సభ్యులు విప్‌ను ధిక్కరించరాదని హెచ్చరికలు జారీ చేసింది.
విప్‌ను ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు, టీడీపీ కూడా ఎన్నికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఇదిలా ఉండగా, ఎన్నికల్లో గెలుపు కోసం క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. అభ్యర్థులకు బలమైన ప్రలోభాలు చూపిస్తూ పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే, అక్కడక్కడా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ విభాగం, అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల ఫలితాలు ఏం ఉంటాయో, ఏ పార్టీ పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.