Site icon NTV Telugu

Afghanistan: నదిని దాటుతుండగా పడవ బోల్తా.. 20 మంది దుర్మరణం..

Boat Accident

Boat Accident

తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నది దాటుతుండగా బోటు బోల్తా పడడంతో 20 మంది మృతి చెందారు. ఘటన సంబంధిత వివరాల్లోకెళితే.. మహ్మంద్ దార్ ప్రాంతంలో నది దాటుతుండగా ఓ బోటు బోల్తా పడింది. ప్రమాదంలో పడవలోని వారందరూ మునిగిపోయారని నంగరార్ ప్రావిన్స్‌కు చెందిన ప్రాంతీయ సమాచార, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఖురేషీ బద్లోన్ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని ఆయన తెలిపారు.

Cyber Crime: 9 కోట్లు మోసపోయిన వ్యాపారవేత్త.. వివరాలు ఇలా..

ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 25 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు. రెస్క్యూ టీం ఐదు మృతదేహాలను కనుగొన్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కెపాసిటీకి మించి మనుషులను ఎక్కించుకోవడంతో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ విషాద గతానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Paruvu: దొరికిపోలి లేదా పారిపోవాలి.. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న ‘పరువు’.. ట్రైల‌ర్ రిలీజ్..

Exit mobile version