NTV Telugu Site icon

Imran Khan: ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ పదవికి పాక్ మాజీ ప్రధాని పోటీ!

Imrankhan

Imrankhan

పాక్ జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ పదవికి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఇమ్రాన్ ఖాన్ పలు కేసుల్లో పాకిస్థాన్‌లోని అడియాలా జైలులో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ 2005 నుంచి 2014 వరకు బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్‌గా కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ పదవి కోసం ఆన్‌లైన్ బ్యాలెట్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ 1972లో ఆక్స్‌ఫర్డ్‌లోని కేబుల్ కాలేజీలో ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ చదివారు. అలాగే బ్రాడ్‌ఫోర్డ్ యూనివర్సిటీకి 2005 నుంచి 2014 వరకు ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు.ఇమ్రాన్ ఖాన్‌తో పాటు, బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్‌లు కూడా ఛాన్సలర్ పదవికి పోటీలో ఉన్నట్లు సమాచారం. గ్రాడ్యుయేట్లు పూర్తి అకడమిక్ దుస్తులతో హాజరు కావాలనే సంప్రదాయ ప్రక్రియకు బదులుగా ఆన్‌లైన్‌లో ఛాన్సలర్ ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా 21 ఏళ్ల పాటు సర్వీసులో ఉన్న లార్డ్‌ ప్యాటెన్‌ (80 ఏళ్లు) రాజీనామాతో ఆ పదవి ఖాళీ అయింది. దీంతో ఈ పదవికి ఇమ్రాన్‌ పోటీ చేయనున్నట్లు ఆయన అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు జుల్ఫీ బుఖారీ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఇమ్రాన్‌ నుంచి స్పష్టత వచ్చాక బహిరంగంగా ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ రేసులో ఖాన్‌ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పలువురి నుంచి మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఇమ్రాన్‌ తరఫు న్యాయవాది తెలిపారు.