NTV Telugu Site icon

AP News: ప్రైవేట్ పాఠశాలలకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

Ap Highcourt

Ap Highcourt

AP High Court: ఏపీలో ప్రైవేట్ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాలపరిమితి 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3 నుండి 8 ఏళ్ల గుర్తింపు కాలపరిమితి పెంపుదలపై 13 మంది రీజినల్ మరియు జిల్లా అధికారులకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Read Also: Minister Amarnath: సీటిస్తేనే పార్టీలో ఉంటామనే నాయకులు వెళ్లిపోవడమే మంచిది..

8 ఏళ్లకు గుర్తింపు పెంచుతూ ఇచ్చిన హైకోర్టు తీర్పు అమలు చేయకుండా యజమాన్యాలను ఇబ్బందులకు గురి చేయటంపై హైకోర్టులో పిటిషన్ వేసింది. యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ (UPEIF) హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో.. కోర్టు ధిక్కరణ కింద 13 మంది రీజినల్ మరియు జిల్లా అధికారులను ఇంప్లిడ్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Read Also: Vishal: కెప్టెన్ విజయకాంత్ మృతి.. వెక్కి వెక్కి ఏడ్చిన విశాల్