NTV Telugu Site icon

AP Schools: స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. రోజుకు 3సార్లు వాటర్ బెల్

Ap Schools

Ap Schools

ఏపీలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వేసవిలో వడగాలుల సందర్భంగా స్కూళ్లల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది విద్యాశాఖ. ఈ క్రమంలో.. వాటర్ బెల్ విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు డీ-హైడ్రేషనుకు గురి కాకుండా వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ చేశారు.

Read Also: Maidaan Traileer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న మైదాన్ ట్రైల‌ర్‌

ఉదయం 08:45, 10:05, 11:50 గంటలకు వాటర్ బెల్ మోగించాలని ఆదేశాలు ఇచ్చారు. బెల్ మోగించిన వెంటనే మంచినీళ్లు తాగేలా చూడాలని సూచనలు చేశారు. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే రెండు డిగ్రీల మేర టెంపరేచర్ పెరగడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా విద్యాశాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది.

Read Also: Siddaramaiah: ఎన్నికల వేళ సిద్ధరామయ్య సెన్సేషనల్ ప్రకటన

కాగా.. లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా 5 నిమిషాల పాటు విద్యార్థులకు వాటర్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు. ఈ విధానాన్ని 2019లో మొదటిసారి కేరళలోని కొన్ని బడుల్లో ప్రారంభించారు. ఈ విధానంపై మంచి స్పందన రాగా.. వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలల్లో అమలు చేస్తున్నారు.