AP High Court: నేడు హైకోర్టులో కీలక పిటిషన్లపై విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు కీలక పిటిషన్లు విచారణకు రానున్నాయి.. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం ఈ రోజు వాదనలు విననుంది.. 41 జీవో తీసుకురావడంపై సీఐడీ దాఖలు చేసిన కేసును సవాల్ చేస్తూ చంద్రబాబు, నారాయణ వేసిన పిటిషన్ పై కూడా నేడు తీర్పు ఇవ్వనుంది హైకోర్టు.
Read Also: Uttar Pradesh: మదర్సాలలో ఏఐ గురించి బోధన.. యూపీ ప్రభుత్వం ఫైలట్ ప్రాజెక్ట్
Also Read
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిట్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.. అలాగే చంద్రబాబును అరెస్ట్ చేయవద్దు అంటూ సీఐడీ పీటీ వారెంట్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే నేటితో ముగియనుంది.. దీంతో… దానిపై కూడా ఈ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇక ఇదే కేసులో ముందస్తు బెయిల్ కోసం నారాయణ భార్య రమాదేవి, బావమరిది సాంబశివరావు, ఆ సంస్థ ఉద్యోగి ప్రమీల వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరగనుంది. ఇటు కేబినెట్ ఆమోదం లేకుండా అసైన్డ్ భూముల కోసం జీవో 41ను తీసుకువచ్చారని.. చంద్రబాబు, నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులపై కూడా తీర్పు వెలువరించనుంది హైకోర్టు. అయితే, రెండు పిటిషన్లపై మళ్లీ విచారించాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు తీర్పు ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలని నారాయణ పిటిషన్ వేశారు. దీనిపై కూడా ఈ రోజు విచారించనుంది హైకోర్టు. దీంతో పాటు అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో సీఐడీ కేసులను క్వాష్ చేయాలని నారాయణ వేసిన పిటిషన్లను విచారించనుంది ఏపీ హైకోర్టు. కాగా, ఇప్పటికే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!