INDIA bloc: ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభంజనం.. కూటమికి 10, బీజేపీకి 02..
- ఉప ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియా కూటమి..
- 13 స్థానాలకు గానూ 10 స్థానాలు కైవసం.. బీజేపీకి 02 స్థానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA bloc: ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 02 సీట్లకు మాత్రమే పరిమితమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, బీహార్ మరియు తమిళనాడులోని 13 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఉపఎన్నికలు జరగగా, ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి.
పంజాబ్ జలంధర్ వెస్ట్ నుంచి ఆప్‌కి చెందిన మోహిందర్ భగత్ విజయం సాధించారు. బెంగాల్‌లో నాలుగు స్థానాలను అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గెలుచుకుంది. ఈ స్థానాల్లో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. తమిళనాడులోని విక్రవాండిలో అధికార డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ గెలుపొందారు.
Also Read
Read Also: IND vs ZIM: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. బౌలర్ ఎంట్రీ
ఇక హిమాచల్ ప్రదేశ్‌లో 03 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచి బీజేపీ కంచుకోట డెహ్రా నియోజకవర్గంలో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో నలాగడ్‌లో కాంగ్రెస్ గెలవగా, హమీర్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఆశిష్ శర్మ విజయం సాధించారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బద్రీనాథ్, మంగ్లూర్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మంగ్లూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఖాసీ మహ్మద్ నిజాముద్దీన్, బీజేపీ అభ్యర్థి ఖటార్ సింగ్ భదానాపై కేవలం 400 ఓట్ల తేడాతో గెలిచారు. మధ్యప్రదేశ్‌లోని అమర్వార్‌లో బీజేపీ అభ్యర్థి కమలేష్ ప్రతాప్ షాహి విజయం సాధించారు. బీహార్ రూపాలీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ విజయం సాధించారు.
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
-
YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రాహుల్‌నే ప్రధాని చేయాలి.. వైఎస్సార్‌కు అదే నివాళి
-
Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!