Site icon NTV Telugu

IMF: పాకిస్తాన్‌కు IMF షాక్.. కొత్తగా మరో 11 షరతులు..!

Imf

Imf

IMF: ఇటీవల భారత్ చేసిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తోంది. తాజాగా అందిన నివేదికలో IMF పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో IMF విధించిన మొత్తం షరతుల సంఖ్య 50కి పెరిగింది. ఇక IMF నివేదిక ప్రకారం, పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్‌గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం.

Read Also: Hyderabad: హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్.. ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని భగ్నం చేసిన పోలీసులు

భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ కింద ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. దీన్ని ప్రతిస్పందనగా పాకిస్తాన్ మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించింది. నాలుగు రోజుల క్రాస్-బోర్డర్ డ్రోన్, మిసైల్ దాడుల తర్వాత మే 10న భారత్-పాకిస్తాన్ మధ్య అవగాహనకు అవకాశం ఏర్పడింది. ఇక IMF కొత్తగా షరతులలో.. జూన్ 2025 లోగా IMF లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించాలి. అలాగే జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమం ఇంకా వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.

Read Also: Abhishek-Aishwarya Rai: పెళ్లి వేడుకలో కూతురితో కలిసి రచ్చరచ్చ చేసిన బచ్చన్ దంపతులు..!

అలాగే IMF సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వము ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. అలాగే ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకరావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది. ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది.

వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా IMF కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరినాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం 5 సంవత్సరాల లోపు వయస్సున్న వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది.

Exit mobile version