NTV Telugu Site icon

Weather news: పలు రాష్ట్రాలకు వాన కబురు.. ఈ ప్రాంతాల్లో 4 రోజులు భారీ వర్షాలు

Fall

Fall

పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ వాన కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర భారత్‌కు చెందిన రాష్ట్రాల జాబితాను కేంద్ర వాతావరణ శాఖ విడుదల చేసింది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 26 నుంచి 29 వరకు ఈ ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే అధికారులు కూడా అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: TS LAWCET: లా సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?

ఏప్రిల్ 26 నుంచి 29 వరకు జమ్మూకాశ్మీర్, లడఖ్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో అయితే ఏప్రిల్ 29న భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షంతో పాటు వడగళ్లు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్‌లో ఏప్రిల్ 28-29 తేదీల్లో వడగళ్ల వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఉద్యోగులు, ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది.

ఇది కూడా చదవండి: Pithapuram: బాబాయ్ కోసం అబ్బాయ్.. పిఠాపురంలో మెగా హీరో ప్రచారం!

ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. అంతగా సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఇక పిల్లలు, వృద్ధులైతే వేడిగాలులతో అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వాతావరణం చల్లబడితే ప్రజలు వేడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.