Site icon NTV Telugu

Heatwave Warning: ఈ రాష్ట్రాల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఐఎండీ హెచ్చరిక

He

He

దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాంటిది రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: Getup Srinu: చిన్న ప్రాణాలన్న ఆర్కే రోజా.. గెటప్ శ్రీను షాకింగ్ రిప్లై

మే 7న పశ్చిమ రాజస్థాన్, సౌరాష్ట్ర అండ్ కచ్, కర్ణాటక సహా పలు ప్రాంతాల్లో హీట్‌వేవ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. తీవ్రమైన వేడి ఉంటుందని చెప్పింది. ప్రజలు అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. హీట్‌వేవ్ కారణంగా ఆరోగ్యంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉందని చెప్పింది. అలసట, హీట్‌స్ట్రోక్, వేడి సంబంధిత అనారోగ్యాలకు దారి తీయొచ్చని సూచించింది. సాధ్యమైనంత మేరకు చల్లని, నీడ ఉన్న ప్రదేశాల్లో సేదదీరాలని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా వృద్ధులు, చిన్నారుల పట్ల శ్రద్ధ తీసుకోవాలని వాతావరణ శాఖ పేర్కొంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. హీట్‌వేవ్ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని తెలిపింది.

ఇది కూడా చదవండి: Thummala: జిల్లాలను రద్దు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అనలేదు

గత కొద్ది రోజులుగా భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే నిప్పులు చిమ్ముతున్నాడు. బయటకు రావాలంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇంకోవైపు ఉక్కపోత, చెమటలతో అల్లాడిపోతున్నారు. ఇక వృద్ధులు, చిన్నారులు మరింత ఇబ్బంది పడుతున్నారు. త్వరగా నైరుతి రుతుపవనాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Nupur Sharma-Raja Singh: నూపుర్ శర్మ, ఎమ్మెల్యే రాజాసింగ్‌లను హత్య చేయాలని కుట్ర పన్నిన మతగురువు అరెస్ట్..

 

Exit mobile version