Getup Srinu: చిన్న ప్రాణాలన్న ఆర్కే రోజా.. గెటప్ శ్రీను షాకింగ్ రిప్లై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే బుల్లితెర కమల్ హాసన్ అనే పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను బుల్లితెర మీద ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్ అంటే తలుచుకుంటేనే నవ్వొచ్చేలా ఉంటుంది పరిస్థితి. ఇప్పటికే సుడిగాలి సుదీర్ హీరోగా పలు సినిమాలు చేస్తూ ఉండగా రాంప్రసాద్ కూడా రచయితగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు గెటప్ శ్రీను హీరోగా రాజు యాదవ్ అనే సినిమా వస్తోంది. ఈ సినిమా మే 17వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియాతో కాసేపు గెటప్ శ్రీనుతో పాటు దర్శకుడు కృష్ణమాచారి, హీరోయిన్ అవంతిక ముచ్చటించారు.
Also Read: Ananya Pandey: ప్రియుడికి గుడ్ బై చెప్పేసిన స్టార్ హీరోయిన్..
Also Read
ఈ సందర్భంగా ఒక మీడియా ప్రతినిధి రోజా మీ అందరిని చిన్న ప్రాణాలు అని సంబోధించారు. మెగా ఫ్యామిలీ సినిమా పరిశ్రమ అంతా విస్తరించి ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇబ్బంది ఉండకుండా వాళ్లు ఏదో జనసేన కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదని కామెంట్ చేశారు. దానికి మీ స్పందన ఏమిటి అని అడిగితే గెటప్ శ్రీను దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ముందుగా ఈ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేసినా ఆ తర్వాత మాత్రం ఆమె చేసినవి చిన్న కామెంట్స్ అని నేను భావిస్తున్నాను అంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు. నిజానికి ఒకప్పుడు నాగబాబు, రోజా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించేవాళ్ళు. తర్వాతి కాలంలో నాగబాబు వెళ్ళిపోయినా రోజా చాలా కాలం ఉంది. అలాంటిది అప్పట్లో తమ జడ్జిగా వ్యవహరించిన రోజా తమను చిన్నవాళ్లు అని సంబోధించడంతో గెటప్ శ్రీను నుంచి ఎలాంటి సమాధానం వస్తుందా అని అందరూ ఎదురు చూస్తే ఆమెవి చిన్న కామెంట్స్ అని భావించాలి అంటూ కర్ర విరగకుండా పాము చావకుండా సమాధానం ఇచ్చాడు.
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!