Monsoon Update: హిమాచల్, జార్ఖండ్, యూపీలోకి రుతుపవనాలు ప్రవేశం.. భారీ వర్షసూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon Update: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండవేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించనుంది. భారత వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు దేశ రాజధాని ఢిల్లీ, యూపీ, బీహార్‌తో సహా పలు రాష్ట్రాల్లోకి త్వరలో ప్రవేశించనున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో రోజంతా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఈ సమయంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. దీంతో పాటు రానున్న మూడు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 28 నాటికి రుతుపవనాలు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోకి ప్రవేశిస్తాయని అంచనా.
యూపీకి హెచ్చరిక
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం యూపీలో రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో పాటు 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ఉత్తరాఖండ్‌లో వేడి నుంచి ఉపశమనం
ఉత్తరాఖండ్‌లోని అనేక నగరాల్లో గత కొన్ని గంటలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ప్రజలు తేమతో కూడిన వేడి నుంచి ఉపశమనం పొందారు. వాతావరణ కేంద్రం ప్రకారం, రుతుపవనాలు ఉత్తరాఖండ్‌లో ఒకటి లేదా రెండు రోజుల్లో ఎప్పుడైనా తాకవచ్చు.
హిమాచల్‌లోకి రుతుపవనాలు ప్రవేశం
మరోవైపు ఈరోజు హిమాచల్ ప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రవేశించాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధిక వర్షాలు కురిశాయని హిమాచల్ ప్రదేశ్ ఐఎండీ డైరెక్టర్ సురేంద్ర పాల్ తెలిపారు. జూన్ 25 నుంచి 26 వరకు దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
జార్ఖండ్‌లో చురుకుగా రుతుపవనాలు
నేటి నుంచి జార్ఖండ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 25-26 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా మినహా 23 జిల్లాల్లో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని, జూన్ 25-26 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.
బీహార్‌లో వేడి నుంచి ఉపశమనం
ఇది కాకుండా బీహార్‌లో రుతుపవనాలు ప్రవేశించాయి. వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో బీహార్‌లో జూన్ 30 నుంచి జూలై 6 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఒడిశాలో మరో 4 రోజులు వర్షాలు
అదే సమయంలో, ఒడిశాలో రుతుపవనాలు చురుకుగా మారాయి. రాబోయే 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. జూన్ 25న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్, కోస్టల్ కర్ణాటక, కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. చాలా రాష్ట్రాల్లో రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!