Site icon NTV Telugu

Illicit Relationship: ప్రియుడితో అక్రమ సంబంధం.. ఫోన్లో బయటపడ్డ వీడియోలు

Illicit Relationship

Illicit Relationship

ఉపాధి కోసం సౌదీ అరేబియాలో పని చేస్తున్న ఓ వ్యక్తి.. తన భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన వీడియోలు బయటపడ్డాయి. దీంతో హుటాహుటిన అక్కడి నుంచి ఇండియాకు వచ్చాడు. ఈ తతంగాన్ని ప్రశ్నించేందుకు స్వదేశానికి వచ్చిన భర్తపై భార్య ప్రియుడితో కలిసి దాడి చేయించింది. ఈ ఘటన యూపీలోని బులంద్‌షహర్‌లోని కొత్వాలి దేహత్ ప్రాంతంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్ లో వారిద్దరికీ సంబంధించిన ఓ వీడియో ఉందని చెప్పాడు.

Read Also: Masala ban: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై రిపోర్టు కోరిన కేంద్రం

ఆ వీడియో చూడగానే వారి మధ్య అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలిసింది. ఈక్రమంలో.. వెంటనే సౌదీ అరేబియా నుండి ఇంటికి వచ్చి, తన భార్యతో అక్రమ సంబంధం గురించి అడిగినట్లు చెప్పాడు. కాగా.. ఏప్రిల్ 22 ఉదయం.. భర్త గంగేరువా గ్రామం నుండి తన గ్రామానికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో ప్రియుడు తన ముగ్గురు సహచరులతో కలిసి తనను అడ్డుకున్నారని అన్నాడు. అంతేకాకుండా.. తనపై దుర్భాషలాడి కత్తితో దారుణంగా దాడి చేశారన్నాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో.. భార్య ప్రియుడితో పాటు నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామని కొత్వాలి ఇన్‌ఛార్జ్ సోమ్‌వీర్ సింగ్ తెలిపారు.

Read Also: Prathinidhi 2: ప్రతినిధి 2 మూవీ రిలీజ్ వాయిదా..

Exit mobile version